ఆరియానాను ప్రెగ్నెంట్ చేసిన హీరో.. అందుకే లావు అయ్యానని పెదవి విప్పిన బ్యూటీ

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోన్న అంశాల్లో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసు ఒకటి. అతడు తనను మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వివాదంగా మారిపోయింది. అప్పటి నుంచి ఇది ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలెబ్రిటీల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అలా లావణ్య.. ఆరియానా గ్లోరీ పేరును కూడా బయటకు తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా శేఖర్ బాషా దీనిపై స్పందించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

రాజ్ తరుణ్‌ కేసు ట్విస్ట్‌లు
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు లావణ్య అనే యువతి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె ఓ హీరోయిన్ పేరును కూడా బయటకు తెచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో ఎన్నో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాజ్ తరుణ్ కేసు చాలా ట్విస్టులతో సాగుతోంది.

Raj Tarun Friend Shekar Basha Gives Clarity On Ariyana Glory Pregnancy

ఆరియానా గ్లోరీతో ఎఫైరని

రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య.. చాలా మంది సెలెబ్రిటీల పేర్లను బయటపెట్టింది. ముఖ్యంగా అతడు బిగ్ బాస్ ఫేం ఆరియానా గ్లోరీతో ఎఫైర్ పెట్టుకున్నాడని, వీళ్లిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని ఆమె ఆరోపించింది. అంతేకాదు, ఓ సినిమా సమయంలో ఆరియానా గ్లోరీ - రాజ్ తరుణ్ మధ్య చాలా విషయాలు జరిగాయని ఆమె చెప్పుకొచ్చింది.

ఆరియానా ప్రెగ్నెంట్ అని
ఇటీవలే ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన లావణ్య 'నన్ను వదిలేసిన తర్వాత రాజ్ తరుణ్.. అరియానాతో రిలేషన్‌లో ఉన్నాడు. ఆమె ప్రెగ్నెంట్ కూడా అయింది. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు చాలా సన్నగా ఉన్న అరియానా.. బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేయడం వల్ల లావు కూడా అయింది' అని కామెంట్స్ చేసింది.

శేఖర్ బాషా ఎంట్రీ ఇవ్వగా

రాజ్ తరుణ్ కేసులో లావణ్య వ్యవహరిస్తోన్న తీరుపై ప్రముఖ ఆర్జే శేఖర్ బాషా స్పందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులోకి అతడు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఆమెను టార్గెట్ చేశాడు. అంతేకాదు, లావణ్యనే మంచిది కాదని, చాలా విషయాల్లో ఆమె అబద్దాలు చెబుతుందని ఆరోపించాడు. ముఖ్యంగా ఆమె చాలా మందికి డ్రగ్స్ కూడా అలవాటు చేసిందని పేర్కొన్నాడు.

Raj Tarun Friend Shekar Basha Gives Clarity On Ariyana Glory Pregnancy

ఆరియానాతో మాట్లాడాను
తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన శేఖర్ భాషా 'అరియానా ప్రెగ్నెంట్ అని అంటుంది. ఆమె ప్రెగ్నెంట్ అయింది.. అందుకే లావు అయిందని చెబుతుంది. ఈ విషయంపై నేను అరియానాతో కూడా మాట్లాడా. అప్పుడామె నాతో ఆడపిల్లకు న్యాయం చేయాలని అంటుంది.. అదే ఆడపిల్లపై ఇంత నీఛంగా నిందలెలా వేస్తుందని చాలా బాధపడుతుంది' అని చెప్పాడు.

అందుకే లావు అయ్యాను

శేఖర్ భాషా కంటిన్యూ చేస్తూ.. 'నాతో ఆరియానా.. నేను లావు అవ్వడానికి ప్రెగ్నెంట్‌కు సంబంధం ఏంటి? నేను సినిమాల కోసం లావు అయ్యాను. దానికి బుద్ది ఉందా? అని అడిగింది. అంతేకాదు, అరియానా త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ విషయం నాకు చెప్పింది. ఇలా ప్రెగ్నెంట్ అంటూ నిందలు వేస్తే ఆమె ఫ్యూచర్ ఏం కావాలి' అంటూ ఫైర్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X