twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌, బాలయ్యతో పోటీ.. నా రేంజ్ ఏమిటంటే.. రాజ్ తరుణ్ (ఇంటర్వ్యూ)

    By Rajababu
    |

    2017లో 'రారండోయ్‌', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌. తాజాగా రాజ్‌తరుణ్‌ హీరోగా చిత్ర శుక్లా హీరోయిన్‌గా శ్రీరంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రంగులరాట్నం'. ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో రాజ్‌తరుణ్‌ జనవరి 4న హైదరాబాద్‌ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు.

     ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్

    ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్

    రంగులరాట్నం' ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. షూటింగ్‌ అంతా ఫినిష్‌ అయ్యాక చిన్న సర్‌ప్రైజ్‌గా సంక్రాంతికి వస్తున్నాం. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను మేము ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. మా సినిమాకి ఇంత క్రేజ్‌ రావడానికి ప్రెస్‌వారే ముఖ్య కారణం.

     ఒకేరోజులో ఒకే చేశాను

    ఒకేరోజులో ఒకే చేశాను

    సుప్రియగారు సడెన్‌గా ఒకరోజు కాల్‌ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. కథ విన్నాక ఇమ్మీడియెట్‌గా ఒప్పుకున్నాను. నాకు బాగా నచ్చింది. అలా ఈ చిత్రం స్టార్ట్‌ అయ్యింది. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి. జనరల్‌గా అందరిలాగే వుంటాడు. కానీ సెలెక్ట్‌ పర్సన్‌. నా లుక్‌, గెటప్‌ అంతా చాలా కొత్తగా వుంటుంది. ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లో కంటే 'రంగులరాట్నం'లో చేసిన క్యారెక్టర్‌కి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా.

     అదే ధైర్యంతో సినిమా చేశా

    అదే ధైర్యంతో సినిమా చేశా

    నా ఫస్ట్‌ సినిమా 'ఉయ్యాలా జంపాలా' చేసేటప్పుడు నేను డైరెక్షన్‌ ఫీల్డ్‌లో వున్నాను. అప్పుడు చిన్న టెన్షన్‌ వుండేది. ఇప్పుడు నేను హీరోగా చేస్తున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్‌లాంటి పెద్ద సంస్థలో చేస్తున్నప్పుడు చాలా ధైర్యంగా వుంటుంది. అందరూ కొత్తవాళ్ళు అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేశాను. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది.

    ప్రతీవారం పోటీ ఉంటుంది

    ప్రతీవారం పోటీ ఉంటుంది

    గతేడాది సంక్రాంతికి కూడా మూడు పెద్ద సినిమాలు వచ్చి సక్సెస్‌ అయ్యాయి. కాంపిటీషన్‌ అనేది ఎప్పుడూ ప్రతివారం ఉంటుంది. హాలిడేస్‌ వున్నాయి. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌ వెళ్ళి సినిమా చూస్తారు. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుని ఎంజాయ్‌ చేసేలా మా చిత్రం వుంటుంది. సంక్రాంతికి రిలీజ్‌ అయ్యే అన్ని సినిమాలు బాగా ఆడాలి. ప్రేక్షకులను అలరించాలి. అందులో మా చిత్రం కూడా వుండాలని కోరుకుంటున్నాను.

     అందమైన ప్రేమ కథ

    అందమైన ప్రేమ కథ

    రంగుల రాట్నం అందమైన ప్రేమ కథ. మదర్‌ సెంటిమెంట్‌. ఇద్దరు ప్రేమికుల మధ్య వచ్చే లవ్‌సీన్స్‌ అన్నీ చాలా ఫ్రెష్‌గా వుంటాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా వుంటుంది. ఆడ, మగ అని తేడా ఉండదు. డైరెక్టర్‌ ఈజ్‌ డైరెక్టర్‌. స్క్రిప్ట్‌ రాశాక వారి పాయింట్‌ వ్యూలో కొన్ని థాట్స్‌ వుంటాయి. దానికి తగ్గట్లుగా సినిమా చేశారు. శ్రీరంజని సెల్వరాఘవన్‌ వద్ద చాలాకాలం పని చేసింది. డైరెక్టర్‌ గురించి బాగా తెలుసు. వెరీ ప్యాషనేట్‌ డైరెక్టర్‌. కమాండింగ్‌గా వుంటుంది. తనకేం కావాలో చాలా పర్టిక్యులర్‌గా వుంటుంది. డైరెక్టర్‌కి కావాల్సిన క్వాలిటీస్‌ అన్నీ శ్రీరంజనిలో వున్నాయి.

    పవన్ కల్యాణ్, బాలయ్యలతోపాటు

    పవన్ కల్యాణ్, బాలయ్యలతోపాటు

    సంక్రాంతి పోటీ అంటూ ఏమిలేదు. పవన్ కల్యాణ్ నటించిన చిత్రం, బాలకృష్ణ నటించిన జై సింహ, సూర్య నటించిన గ్యాంగ్ చిత్రాలు సంక్రాంతి పడుగు నేపథ్యంలో వస్తున్నాయి. అదేవిధంగా మా రంగుల రాట్నం కూడా రిలీజ్ అవుతున్నది. అన్ని చిత్రాలు విజయం సాధించాలని కోరుకొంటున్నాను. పవన్‌, బాలయ్యతో పోటీ పడటం లేదు. వాళ్ల రేంజ్ ఎక్కడ.. నా రేంజ్ ఎక్కడ. సంక్రాంతికి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది.

    అద్భుతంగా శ్రీ చరణ్ సంగీతం

    అద్భుతంగా శ్రీ చరణ్ సంగీతం

    రంగుల రాట్రం చిత్రానికి చాలా టైటిల్స్‌ అనుకున్నాం. కానీ ఏదీ సెట్‌ కాలేదు. కథలోంచి టైటిల్‌ వుంటే బాగుంటుందని అందరం డిస్కస్‌ చేసుకుని 'రంగులరాట్నం' అని పెట్టాం. కథకి యాప్ట్‌ టైటిల్‌. క్షణం చిత్రానికి మ్యూజిక్‌ చేసిన శ్రీచరణ్‌ ఈ చిత్రానికి బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ని కంపోజ్‌ చేశారు. ఆరు పాటలు ఎక్స్‌లెంట్‌గా వున్నాయి. చాలా కొత్త సౌండింగ్‌తో ట్యూన్స్‌ కంపోజ్‌ చేశాడు శ్రీచరణ్‌. నేను కూడా ఇందులో ఒక పాట రాశాను. రీ-రికార్డింగ్‌ వండ్రఫుల్‌గా చేశాడు. శ్రీచరణ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి చాలా హెల్ప్‌ అవుతుంది.

     చిత్ర శుక్లాకు తొలి చిత్రం

    చిత్ర శుక్లాకు తొలి చిత్రం

    చిత్ర శుక్లా ఫస్ట్‌టైమ్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తుంది. ఎక్కువ రెస్పాన్స్‌బులిటీస్‌ వున్న అమ్మాయి క్యారెక్టర్‌ని ప్లే చేసింది. అల్లరి చిల్లరగా తిరుగుతూ సెటిల్‌ అయిన ఓ అబ్బాయి, అమ్మాయిల మధ్య లవ్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది అనేది కథ. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా కథ సాగుతుంది. ప్యూర్‌ లవ్‌స్టోరి. యూత్‌, ఫ్యామిలీస్‌ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఈ చిత్రం వుంటుంది. ఆల్‌రెడీ నేను ఫస్ట్‌కాపీ చూశాను. నాకు బాగా నచ్చింది. డెఫినెట్‌గా ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది.

     ఇతర పాత్రల్లో నటీనటులు

    ఇతర పాత్రల్లో నటీనటులు

    రంగుల రాట్నం చిత్రంలో సితారగారు నాకు మదర్‌ క్యారెక్టర్‌లో నటించారు. ప్రియదర్శి నా ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో నటించాడు. చాలా రియలిస్టిక్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లుగా కామెడీ వుంటుంది. సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది.

    English summary
    After delivering Super Hit's like 'Ra Randoi Veduka Chuddam','Hello' in 2017, Annapurna Studios is getting ready with Youthful Entertainer 'Rangula Raatnam' starring Raj Tharun, Chitra Shukla as lead pair, Introducing Shree Ranjani as Director. Filmmis currently undergoing it's censor formalities. Filmmis getting ready to release worldwide on January 14th. On this occasion Hero Raj Tharun interacted with media in a press meet held at Annapurna 7 acres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X