twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ: హెబ్బా పటేల్‌తో ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది.. అందుకే..

    ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్ర విజయాల తర్వాత హీరో రాజ్ తరుణ్ తాజాగా చేస్తున్న సినిమా అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ స

    By Rajababu
    |

    సినిమా పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండానే రాజ్ తరుణ్ సోలో హీరోగా ఎదిగాడు. పరిశ్రమకు వరుసగా హిట్ల మీద హిట్లు ఇస్తున్నాను. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్ర విజయాల తర్వాత హీరో రాజ్ తరుణ్ తాజాగా చేస్తున్న సినిమా అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించిన విశేషాలను ఆయన మీడియాతో పంచుకొన్నారు. జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటందని రాజ్ తరుణ్ ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో రాజ్ తరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

     అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్

    అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్

    అంధగాడు సినిమా టైటిల్ అనగానే ఎలాంటి సందేహం వద్దు. ఆ టైటిల్ విని ఇదేదో ఆర్ట్ ఫిలిం అనుకోవద్దు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్ సినిమా. షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశా. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆడియెన్‌గా కథ విన్నప్పుడు ఎక్సైట్ అయితే సినిమాను ఒప్పుకొంటాను అని రాజ్ తరుణ్ చెప్పారు.

    ఫస్ట్ టైం దర్శకుడు అనిపించరు..

    ఫస్ట్ టైం దర్శకుడు అనిపించరు..

    ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడు. ఫస్ట్ టైం దర్శకుడు అని ఎప్పుడు అనిపించరు. ఆయన మంచి నటుడు. కంటెంట్ విషయంలో చాలా క్లారిటీ ఉంది. డైరెక్టర్‌ వలిగొండ శ్రీనివాస్ ఓ సారి అంధుల హాస్టల్‌కు వెళితే వాళ్లు చాలా యాక్టివ్ ఉన్నారట. వారిని చూస్తే బ్లైండ్ అనిపించలేదట. ఈ పాత్ర కోసం ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. వారి గురించి తెలుసుకోని చాలా యాక్టివ్ అయ్యాను అని వెల్లడించారు.

    కథ విని ఎక్సైటింగ్‌గా ఫీలయ్యాను..

    కథ విని ఎక్సైటింగ్‌గా ఫీలయ్యాను..

    క్యారెక్టర్ నచ్చి అంధగాడు సినిమా చేశాను. డైరెక్టర్ చెప్పిన కథ విని ఎక్సైటింగ్ ఫీలయ్యాను. అందుకే ఈ సినిమా చేశాను. ఈ సినిమా ఒక జోనర్‌కు పరిమితం కాదు. డ్రామా, ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అనేక అంశాలు కలిసి ఉంటాయి. అందుకే కథ విన్నప్పుడు గతంలో ఏ సినిమాలో కథ విన్నా కలుగని ఫీలింగ్ ఈ సినిమాకు కలిగింది అని రాజ్ పేర్కొన్నారు.

    40 నిమిషాలు అంధుడిపాత్ర

    40 నిమిషాలు అంధుడిపాత్ర

    డైరెక్టర్ ఏది చెప్తే అది చేశాను. అంధుడి పాత్ర దాదాపు 40 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత హీరోకు కళ్లు వస్తాయి. ఈ సినిమాలో అంధులను కించపరిచే సన్నివేశాలు ఉండవు. అలాంటి గొప్పవారిపై సెటైర్ వేసే స్థాయి మనకు లేదు. నా బాడీ లాంగ్వేజికి తగినట్టుగానే కథ ఉంటుంది. సిట్చువేషన్స్ మారుతాయి. నా తరహా క్యారెక్టరైజేషన్ ఉంటుంది అని రాజ్ తరుణ్ తెలిపారు.

    హెబ్బాతో కంఫర్ట్ లెవెల్ ఎక్కువ

    హెబ్బాతో కంఫర్ట్ లెవెల్ ఎక్కువ

    హెబ్బా పటేల్‌తో ఇది మూడో సినిమా. బేసిక్‌గా నాకు మంచి ఫ్రెండ్. ఆమెతో కంఫర్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఆమెతో సినిమా చేస్తే బోర్ కొట్టదు. వరుసగా సినిమాలు చేయడం వల్ల జనాలకు బోర్ కడుతుందేమోనని భయం వేస్తున్నది. అందుకే ఆమెతో మరో రెండేళ్లు నటించకూడదు అని అనుకుంటాను అని రాజ్ తరుణ్ అన్నారు.

    English summary
    Tollywood hero Raj Tarun's latest movie is Andhhagadu. Hebba Patel paired third in a row. Writer Veligonda Srinivas is first director for this movie. Anil Sunkara is the producer. This movie is slated to release on June 2nd. In this occassion, Raj Tarun shared this movie's experiencess with the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X