ఆ బంధం హార్ట్‌కు సంబంధించిన రిలేషనే.. డైరెక్షన్ చేయాలని ఉంది.. రాజ్ తరుణ్

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్ర విజయాల తర్వాత హీరో రాజ్ తరుణ్ తాజాగా చేస్తున్న సినిమా అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు.

By Rajababu

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటింది. వారితో ఎలాంటి కాంట్రాక్టులేదు అని హీరో రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్ర విజయాల తర్వాత హీరో రాజ్ తరుణ్ తాజాగా చేస్తున్న సినిమా అంధగాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించిన విశేషాలతో ఆయన వ్యక్తిగత విషయాలను ఆయన మీడియాతో పంచుకొన్నారు. జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటందని రాజ్ తరుణ్ ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో రాజ్ తరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

 పాటలు క్యాచీగా ఉన్నాయి..

పాటలు క్యాచీగా ఉన్నాయి..

అంధగాడు సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. సినిమా చూపిస్త మావా చిత్రానికి మించిన మ్యూజిక్‌ను ఇచ్చాడు. పాటలు వినగానే క్యాచీగా ఉంటాయి. ఒక్కో పాట ట్యూన్ పూర్తవగానే ఒకదాని వెంట ఒకటి విన్నాను. విన్న ప్రతీపాట బాగా ఆకట్టుకొన్నది. డెఫినెట్‌గా అంధగాడు సినిమా మ్యూజికల్‌గా కూడా హిట్ అవుతుంది.

కథ గురించి కామన్ ఆడియెన్‌గా ఆలోచిస్తా..

కథ గురించి కామన్ ఆడియెన్‌గా ఆలోచిస్తా..

అంధగాడు తర్వాత ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లోనే రాజుగాడు యమ డేంజర్ అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాను. వారితో ఎలాంటి కమిట్‌మెంట్, కాంట్రాక్టుల లేదు. వారితో ఉన్నది హృదయపూర్వక సంబంధమే. నా వద్ద కథ వస్తే కామన్ ఆడియన్‌గా ఆలోచిస్తాను. కథకు ఎలా న్యాయం చేయాలి అనేది ఆలోచిస్తాను తప్ప వేరే ధ్యాస ఉండదు.

డైరెక్షన్ ఆలోచన ఉంది.. కానీ.

డైరెక్షన్ ఆలోచన ఉంది.. కానీ.

ప్రస్తుతం యాక్టింగ్ బిజీగా ఉన్నాను. నేను నటించిన సినిమాలు బాగా ఆడుతున్నాయి. సక్సెస్ రేట్ బాగున్నది. ఇప్పట్లో డైరెక్షన్‌పై ఆలోచన లేదు. దర్శకత్వం వహించాలంటే ఒక సంవత్సరం గ్యాప్ ఉండాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. మంచి కథ దొరికితే డైరెక్షన్ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి యాక్టింగ్ పైనే నా దృష్టి అంతా అని రాజ్ తరుణ్ చెప్పారు.

 40 నిమిషాల అంధుడి పాత్ర

40 నిమిషాల అంధుడి పాత్ర

అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో సినీ రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అంధగాడు సినిమాలో అంధుడి పాత్రను పోషిస్తున్నాను. దాదాపు 40 నిమిషాలు నిడివి మేర ఈ పాత్ర ఉంటుంది. డబ్బింగ్ చెప్పేటప్పడు సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. అంధగాడు రూపంలో మరో హిట్ అందుతుందనే ఆశాభావంతో ఉన్నాను అని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X