ప్రేమలో పడ్డ రాజ్ తరుణ్.. పెళ్లి ఎప్పుడు? అమ్మాయి ఎవరు?.. అసలు సంగతులు చెప్పిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరోలందరూ ఒక్కొక్కరిగా పెళ్లి పీఠలెక్కుతున్నారు. ఈ ఏడాదిలో చాలా మంది తారలు ఓ ఇంటి వారు అవుతున్నారు. ఈ లాక్ డౌన్‌లో ఎంచక్క మన హీరోలు పెళ్లిళ్లు చేసుకుని ఆనందంగా గడిపేస్తున్నారు. నిఖిల్, నితిన్, రానా వంటి హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొందరరు పెళ్లి పీఠలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. మెగా ఇంట్లో రెండు ఈవెంట్లు జరిగేలా కనిపిస్తున్నాయి. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో మాత్రం పెళ్లి సందడి కనిపిస్తోంది.

పెళ్లిళ్ల హడావిడి..

పెళ్లిళ్ల హడావిడి..

లాక్ డౌన్ పుణ్యమా అని అందరికీ పెళ్లిపై ఆలోచనలు వచ్చినట్టున్నాయి. బ్యాచ్‌లర్ హీరోలంతా మూడు ముళ్లు వేసేస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి పీఠలెక్కబోతోన్నాడని వార్తలు వచ్చాయి. ఎలాగూ మెగా ఇంట్లో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఆ వెంటనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి కూడా చేసేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

రాజ్ తరుణ్ కూడా..

రాజ్ తరుణ్ కూడా..

రాజ్ తరుణ్ కూడా పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా అలీతో సరదాగా షోలో అతిథిగా విచ్చేసిన రాజ్ తరుణ్ అనేక విషయాల గురించి చెప్పాడు.

ప్రేమ పెళ్లి..

ప్రేమ పెళ్లి..

పెళ్లి విషయాన్ని రాజ్ తరుణ్ ప్రస్తావిస్తూ.. నిఖిల్‌కు తన పెళ్లి చాలా గ్రాండ్‌గా చేసుకోవాలని ఉండేదని, కరోనా రావడంతో సింపుల్‌గా చేసుకోవాల్సి వచ్చిందన్నాడు. తనది కూడా లవ్‌ మ్యారేజ్‌ అవుతుందని, కానీ సమయం పడుతుందని అసలు విషయం బయటపెట్టేశాడు.

స్వయం వరమా?

స్వయం వరమా?

స్వయం వరం పెడతావా? అంటూ అలీ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నవ్విన రాజ్ తరుణ్.. స్వయంవరం పెడితే ఒక్కడినే కూర్చొని ఈగలు తోలుకోవాలేమో. అసలు 27ఏళ్లు రాగానే పెళ్లి చేసుకుందామనుకున్నా. ఇప్పుడు మరో రెండు, మూడేళ్లు ఆగుతా అంటూ గుట్టు విప్పేశాడు.

Recommended Video

Raj Tarun Disturbed Me A Lot - Malavika Nair
పేరు మాత్రం చెప్పలేదు..

పేరు మాత్రం చెప్పలేదు..

అయితే రాజ్ తరుణ్ మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించాడు. అమ్మాయి ఎవరు అని అడిగితే మాత్రం.. భలే తప్పించుకున్నాడు. ఫ్యూచర్‌ మిస్సెస్‌ రాజ్‌తరుణ్‌ అంటూ సమయస్ఫూర్తితో సమాధానమిచ్చి టాపిక్ డైవర్ట్ చేశాడు. మరి ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా? లేదా బయటి అమ్మాయో ఇంకొన్ని రోజులు ఆగితే తెలిసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X