»   » షాక్: రాజ్ తరుణ్‌పై నిందలొద్దు, నేనే తప్పుచేసాన్న వర్మ

షాక్: రాజ్ తరుణ్‌పై నిందలొద్దు, నేనే తప్పుచేసాన్న వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఉయ్యాల జంపాల', ‘సినిమా చూపిస్త మావ' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న కుర్ర హీరో రాజ్ తరుణ్ త్వరలో రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం రాజ్ తరుణ్ తన ట్విట్టర్లో వర్మ గురించి చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

‘రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్నాను. కానీ వర్మ ప్రస్తుతం జస్ట్ ఓకే ఓ డైరెక్టర్. నేను డైరెక్టర్ అయితే రంగీల, శివ కంటే బెటర్ సినిమాలు చేస్తాను. బట్ స్టిల్ ఆర్జీవీ ఓకే ఓకే' అంటూ ట్వీట్ చేసాడు. రాజ్ తరుణ్ ట్వీట్ చూసిన వర్మ అభిమానులకు మండింది. రెండు హిట్స్ వచ్చేసరికి రాజ్ తరుణ్‌కు పొగరు తలకెక్కింది అంటూ విమర్శలు మొదలయ్యాయి. రాజ్ తరుణ్ ట్వీట్స్ చూసి కొందరు సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్య పోయారు.

Raj Tarun is a very sweet, serious and passionate guy: Ram Gopal Varma

వాస్తవానికి ఈ ట్వీట్స్ చేసింది రాజ్ తరుణ్ కాదట. అతని ట్విట్టర్ ఖాతా నుండి అతను కాకుంటే మరెవరు? ఆ ట్వీట్స్ చేసారని అనుకుంటున్నారా?....ఈ ఘన కార్యం చేసింది మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మే. రాజ్ తరుణ్ ఫోన్ తీసుకుని అతని అకౌంట్ ద్వారా తనపై తానే ఇలా సెటైర్స్ వేసుకున్నాడట.

ఆ ట్వీట్స్ మూలంగా రాజ్ తరుణ్ ఇబ్బందుల్లో పడటంతో....వర్మ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాజ్ తరుణ్ ను ఏమీ అనొద్దు. అతను స్వీట్ గై. నేనే అతని ఫోన్ తీసుకుని అలా ట్వీట్స్ చేసాను. జస్ట్ ఫన్ కోసమే ఇదంతా చేసాను. నేను చేసిన ట్వీట్స్ వల్ల అతనిపై నెగెటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దు అంటూ.... తన సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు వర్మ. స

పబ్లిసిటీ కోసమే రామ్ గోపాల్ వర్మ ఇదంతా చేసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు!

English summary
"With regard to Raj Taruns tweets on me , just for fun I myself took his phone and put all those tweets ..please don't take them seriously. Raj Tarun is a very sweet, serious and passionate guy and if my mischief with his phone created a negative vibe about him,it's my mistake." Ram Gopal Varma said.
Please Wait while comments are loading...