ప్రైవేట్ వీడియోస్ లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్.. ప్రియుడిపై లావణ్య సంచలన ఆరోపణలు..
తెలుగు సినిమా దగ్గర గత కొన్ని వారాలు నుంచి నాన్ స్టాప్ గా వినిపిస్తున్న కాంట్రవర్సీ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా టాలీవుడ్ జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అలాగే తన మాజీ ప్రేయసి లావణ్యల వ్యవహారమే అని చెప్పాలి. కాగా తనని మోసం చేసాడని ఈమె.. లేదు ఆమె వల్ల నేను మెంటల్ టార్చర్ అనుభవించాను అని రాజ్ తరుణ్ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
కాగా రోజుకో కొత్త మలుపు తిరుగుతూ వస్తున్నా ఈ ఇద్దరి కేసు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారుతూ వెళుతుంది. అయితే రీసెంట్ గానే రాజ్ తరుణ్ రానా సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా చాలా ఘాటు ప్రశ్నలనే ఎదుర్కొన్నాడు ఈ క్రమంలో రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఎంట్రీ ఇవ్వడం అతడిపై లావణ్య చెప్పు దాడులు చెయ్యడం వంటివి ఇలా రోజుకో కొత్త ట్విస్ట్ తో ఊహించని విధంగా వీరి కేసు పలు రకాలుగా వెళుతుంది.

అయితే రాజ్ తరుణ్ లావణ్య తనపై కేసు పెట్టిన స్టార్టింగ్ లోనే పలు సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెకి నేను మాత్రమే కాదు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి అని ఆమె మస్తాన్ సాయి అనే అతన్ని ప్రేమించింది అన్నట్టుగా కామెంట్స్ చేసాడు. అంతేకాకుండా ఆమెతో తాను కలిసి ఉంది, ఇరువురు కూడా ప్రేమించుకున్నారు అన్నట్టుగా తాను కామెంట్స్ చేసాడు.
అయితే ఇపుడు లావణ్య ఈ మస్తాన్ సాయి పై షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మస్తాన్ సాయి అనే ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని, వాటితో తనని చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేసాడని ఆమె ఆరోపించింది. అలాగే తన ఒక్కదానివే కాకుండా ఇంకా చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయంటూ సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఇక్క లావణ్య వెర్షన్ లో ఎక్కడో పొంతన కుదరటం లేదని చెప్పాలి.
అలాంటి వ్యక్తి దగ్గరకి ఈమె ప్రైవేట్ వీడియోలు ఎలా వెళ్లినట్టు. ఆమె చెప్తున్నా దాని ప్రకారం ఓ రోజు అతని దగ్గరకి వెళితే తనకి తెలియకుండా వీడియో రికార్డు చేసాడని చెబుతుంది. కానీ ఆమాత్రం పరిచయం కూడా లేకుండా ప్రైవేట్ వీడియో తీయడం వరకు వెళ్లడం అనేది మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇలా మొత్తానికి అయితే రాజ్ తరుణ్ లావణ్యల కేసు మాత్రం మరిన్ని ఆసక్తికర మలుపులు తిరుగుతూ వెళుతుంది అని చెప్పాలి.
అలాగే ఫైనల్ గా ఎవరు ఇనోసెంట్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారగా దీనిపై తెలుగు యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా రాజ్ తరుణ్ రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి థియేటర్స్ లో వారం గ్యాప్ తో వచ్చాడు. వీటిలో పురుషోత్తముడు పర్వాలేదనిపించింది కానీ ఆ నెక్స్ట్ వీక్ వచ్చిన చిత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మాల్వి మల్హోత్రా తోనే ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రేమాయణం సాగిస్తున్నాడు అని అందుకే నన్ను వదిలేసాడు అంటూ లావణ్య చెబుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











