టెలివిజన్ షో లైవ్‌లో చెప్పుతో కొట్టిన లావణ్య.. రాజ్ తరుణ్ ఫ్రెండ్‌కు చేదు అనుభవం!
తెలుగు హీరో రాజ్ తరుణ్‌తో వివాదం కొత్త మలుపు తిరిగింది. లావణ్యతో ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వివాదంలో అండగా నిలుస్తున్న ఆర్జే శేఖర్ భాషాకు చేదు అనుభవం ఎదురైంది. కొద్ది రోజులుగా లావణ్య, ఆర్జేకు జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. తాజాగా లైవ్‌లో ఎదురు పడిన వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో సహనం కోల్పోయిన లావణ్య దాడికి ప్రయత్నించింది. ఆ దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన లావణ్యపై శేఖర్ భాషా పలు ఆరోపణలు చేస్తూ ఆమె చేసిన పనులను ఆధారాలతో సహ బయటపెట్టారు. దాంతో వారిద్దరి మధ్య భారీగా గొడవ చోటుచేసుకొన్నది.

లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఆరు నెలలు జైలులో ఉంది. అలాంటిది మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొన్నది అంటూ ఆర్జే శేఖర్ ఆరోపణలు చేశాడు.అయితే నీవల్ల ఓ అమ్మాయి సూసైడ్ చేసుకొన్నది. నీవు మోసం చేయడం వల్లే ఆమెకు అలాంటి పరిస్తితి ఎదురైందని లావణ్య ఆరోపణలు చేసింది.
ఇలాంటి వివాదాస్పద, గందరగోళ పరిస్థితుల మధ్య ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో డిబేట్‌కు లావణ్య, శేఖర్ భాషా వచ్చారు. వారిద్దరూ పరస్పరం ఆరోపణలు చేశారు. ఓ దశలో లావణ్యపై ఆరోపణలు చేస్తూ చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నది. ఆమెపై కామెంట్ చేయడంతో.. పక్కనే ఉన్న ఆమె చేతులోకి చెప్పు తీసుకొని లైవ్‌లోనే ఆర్జే శేఖర్ భాషాను ముఖంపై కొట్టింది.
లావణ్య దాడి ఘటనతో బిత్తరపోయిన మరో వ్యక్తి వారిద్దరు గొడవ పడటాన్ని ఆపారు. లైవ్‌లోనే ఈ ఘటన చేసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివాదంలో ఇంకా ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందో అని అందరూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











