»   » ఆ ముగ్గురినీ కాదని రాజ్ తరుణ్‌తో హెబ్బ పటేల్ పెళ్లి!

ఆ ముగ్గురినీ కాదని రాజ్ తరుణ్‌తో హెబ్బ పటేల్ పెళ్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ల‌క్కీ మీడియా బ్యానర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌. రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు.

డిసెంబర్ 16న సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ బాయ్ ఫ్రెండ్స్ గా అశ్విన్, పార్వతీశం, నోయల్ నటిస్తున్నారు. అయితే సినిమా క్లైమాక్స్ లో ఈ ముగ్గురినీ కాదని హీరో రాజ్ తరుణ్ ను పెళ్లాడుతుందట.

వాస్తవానికి ఈ చిత్రంలో రాజ్ తరుణ్ లేడు... కానీ చివర్లో గెస్ట్ రోల్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరుస్తాడట. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో కుమారి 21 ఎఫ్, ఆడో రకం ఈడో రకం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

నేను నా బాయ్ ఫ్రెండ్స్

నేను నా బాయ్ ఫ్రెండ్స్

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందే సినిమాల‌ను రూపొందించే మా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`. హెబ్బా, రావు ర‌మేష్‌, అశ్విన్‌, నోయెల్‌, పార్వ‌తీశం, తేజ‌స్విని స‌హా అంద‌రూ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమా బాగా వ‌చ్చింది. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజుగారు సినిమా చూడ‌గానే సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. దిల్‌రాజుగారు సినిమాను రిలీజ్ చేస్తుండ‌టంతో సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని తెలిపారు.

సెన్సార్

సెన్సార్

రీసెంట్‌గా విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ ఎంజాయ్ చేసేలా రూపొందిన ఈ సినిమాను డిసెంబ‌ర్ 16న విడుద‌ల చేస్తున్నామని తెలిపారు నిర్మాత.

తారాగణం

తారాగణం

రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌నా, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌రులు న‌టించారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి క‌థః బి.సాయికృష్ణ‌, పాటలుః చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్‌, కొరియోగ్ర‌ఫీః విజ‌య్ ప్ర‌కాష్‌, స్టంట్స్ః వెంక‌ట్‌, స్క్రీన్‌ప్లే, మాట‌లుః బి.ప్ర‌స‌న్న‌కుమార్‌, ఎడిట‌ర్ః చోటా కె.ప్ర‌సాద్‌, ఆర్ట్ః విఠ‌ల్ కోస‌నం, మ్యూజిక్ః శేఖ‌ర్ చంద్ర‌, సినిమాటోగ్ర‌ఫీః చోటా కె.నాయుడు, ప్రొడ‌క్ష‌న్ః ల‌క్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్‌(గోపి), ద‌ర్శ‌క‌త్వంః భాస్క‌ర్ బండి.

English summary
Raj Tarun Marries Hebah Patel in Nanna Nenu Na Boyfriends movie. Producer Dil Raju Bags Nanna Nenu Naa Boyfriend movie which has been pictured in the female leading role by Hebah Patel and this is her third film in Telugu. There are casts like Ashwin, Parvateesam, Noel Sean, Rao Ramesh who given their terrific performances to their respective roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu