రాజ్ తరుణ్ 'లవర్' ఫస్ట్ లుక్.. ఆకట్టుకునేలా మోషన్ పోస్టర్!
యంగ్ హీరో రాజ్ తరుణ్ మరో సినిమా ప్రారంభమైపోయింది. రాజ్ తరుణ్ ఇటీవలే రాజుగారు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ చిత్రం నిరాశపరిచింది. తాజగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రూపొందుతున్న రాజ్ తరుణ్ చిత్రం లవర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలయింది.
రాజ్ తరుణ్ సరసన ఈ చిత్రం రద్దీ కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ తరుణ్ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ లో రాజ్ తరుణ్, రద్దీ కుమార్ రొమాంటిక్ స్టిల్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్ లో కొండ చివరన రాజ్ తరుణ్ కూర్చుని ఉండగా పక్కనే బైక్ ఉంది. మొత్తంగా మోషన్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. వరుసగా రాజ్ తరుణ్ చిత్రాలు నిరాశ పరుస్తున్న తరుణంలో ఈ చిత్రంతో విజయం అందుకోవాలని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











