రాజ్ తరుణ్ కోట్లు ఆఫర్.. సెటిల్మెంట్ కోసం ప్రయత్నం..సంచలన నిజాలతో లావణ్య

గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ వార్తల్లో గట్టిగా వినిపిస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. ఐతే సినిమాకి చెందిన వారు తమ సినిమాలతో వినిపిస్తే రెగ్యులర్ గానే ఉంటుంది కానీ రాజ్ తరుణ్ మాత్రం పెద్ద కాంట్రవర్సీతో బాగా వినిపిస్తున్నాడు. కాగా తన ప్రేయసి లావణ్య అలాగే యువ హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేర్లతో ఇప్పుడు రచ్చ నడుస్తుండగా వీరి ముగ్గురి మేటర్ మాత్రం రోజుకో కొత్త ట్విస్ట్ కొత్త టర్న్ ని తీసుకుంటుంది.

అయితే రాజ్ తరుణ్ ఇప్పుడు వరకు తీసిన అన్ని సినిమాల్లో కూడా ఈ రేంజ్ అడ్వెంచర్ లు ఉన్నాయో లేదో కానీ తన కాంట్రవర్సీలో మాత్రం రోజుకో విస్తుపోయే నిజం బయటకి వస్తుంది. కాగా ఓ పక్క ఈ కాంట్రవర్సీ నడుస్తుంటే రాజ్ తరుణ్ మరియు మాల్వి మల్హోత్రాలు తాము నటించిన తాజా చిత్రం "తిరగబడరా సామి" ప్రమోషన్స్ జోరుగా చేసేసుకునుంటున్నారు.

raj tarun offered crores of money to settlement with lavanya

మరి మరోపక్క లావణ్య తండ్రి ఇప్పటికీ మించింది లేదు రాజ్ తరుణ్ వస్తే తన ఆస్తి అమ్మైనా గ్రాండ్ గా తన కూతురుతో పెళ్లి చేస్తా అంటున్నారు. ఇలా రకరకాలుగా మారుతున్న వీరి వ్యవహారంలో ఇప్పుడు మరో షాకింగ్ నిజం బయటకి వచ్చింది. కాగా లావణ్య తాజాగా తన లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో ఓ ప్రెస్ మీట్ పెట్టి వాపోయింది. గత కొన్నాళ్ల నుంచి డిప్రెషన్ వల్ల నా మానసిక పరిస్థితి బాగోలేదు అని తెలిపింది.

అలాగే రాజ్ తరుణ్ నుంచి డబ్బులు ఆఫర్ వచ్చాయి అనే మాటకి కూడా స్పందిస్తూ మరిన్ని షాకింగ్ నిజాలు చెప్పింది. తనకి రెండు సార్లు కాల్స్ వచ్చాయి అని ఒకటి రాజ్ తరుణ్ మ్యానేజర్ నుంచి ఇంకోసారి ఎవరో లాయర్ నుంచి వచ్చింది అని కేసు వదిలేసి రాజ్ తరుణ్ ని క్షమాపణ అడిగితే 5 కోట్లు ఇస్తామని చెప్పినట్టుగా వెల్లడించింది. కానీ దానికి ఆమె నో చెప్పేసినట్టుగా తెలిపింది.

అయితే ఒకవేళ ఆ ఆఫర్ వద్దు అనుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వారు నన్ను బెదిరించారని కూడా చెప్పుకొచ్చింది. అయినా కూడా ఇప్పటికీ తనకి రాజ్ తరుణ్ నే కావాలని చెబుతుంది. అతను నాతో ఉంటాడో లేదో నాకు తెలీదు కానీ అతన్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను అని లావణ్య తాజా ప్రెస్ మీట్ లో తెలిపింది.

అయితే ఇక్కడ తన ప్రేయసిని వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ 5 కోట్లు ఆఫర్ చేయడం అనేది మాత్రం షాకింగ్ గా మారింది అని చెప్పాలి. ఇది విన్న వారు రాజ్ తరుణ్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో సాఫ్ట్ గా కనిపిస్తూ ఆఫ్ స్క్రీన్ లో రాజ్ తరుణ్ చేస్తున్న పనులకి తనపై మరింత నెగిటివ్ ఇప్పుడు పెరిగేలా అనిపిస్తుంది. మరి చూడాలి వీరు కేసుల్లో ఎవరు ఇనోసెంట్ అనేది..

More from Filmibeat

Read more about: lavanya raj tarun malvi malhotra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X