Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఒరేయ్ బుజ్జిగా.. ఇక ఓటీటీ బాట పట్టాల్సిందే.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ లో బడ్జెట్ తో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. 25కోట్లకు పైగా మార్కెట్ ఉన్న నాని లాంటి హీరో కూడా తన 25వ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేశాడు. అంతకుముందు కొంచెం చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రమే వచ్చాయి. ఇక యూత్ లో కొంత క్రేజ్ ఉన్న యువ హీరో రాజ్ తరుణ్ కూడా ఇప్పుడు అదే దారిలోకి వచ్చాడు.
రాజ్ తరుణ్ గత కొంత కాలంగా వరుస అపజయలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని ఒరేయ్ బుజ్జిగా సినిమాతో రెడీ అయ్యాడు. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విజయ్ కుమార్ కొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
అయితే ఎంత ఆలస్యం అయినా కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాత రాధా మోహన్ గట్టిగానే ఓపిక పట్టాడు. కానీ ఇప్పట్లో సినిమా హాళ్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక వేళ తెరిచినా కూడా జనాలు గతంలో మాదిరిగా అయితే థియేటర్స్ కి రాలేరని కూడా అర్ధమవుతోంది. అందుకే ఒరేయ్ బుజ్జిగా సినిమాను ఆహా యాప్ లో రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ డీల్ సెట్ చేసుకుంటున్నట్లు టాక్.