రాజ్ తరుణ్ రాజుగాడు సెన్సార్ వివరాలు!
రాజ్ తరుణ్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు". నూతన దర్శకురాలు సంజనారెడ్డి ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
రాజుగాడు సినిమా జూన్ ఒకటో తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (మంగళవారం ) గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న రాజుగాడు సినిమాకు యు/ఏ సట్టిఫికేట్ లభించింది. సినిమా కథ కొత్తగా ఉందని సమాచారం. మూవీ చూసిన సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











