twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే పారిపోయాను: కారు ప్రమాదంపై స్పందించిన రాజ్ తరుణ్.. దయచేసి అలా చేయండంటూ లేఖ

    |

    Recommended Video

    Actor Raj Tarun Releases A Letter Of Explanation About Road Mishap Incident || Filmibeat Telugu

    మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే హీరో తరుణ్ కారు అని వార్తలు వచ్చాయి. వీటిని అతడు ఖండించడంతో, తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి పారిపోతున్న వ్యక్తి రాజ్ తరణ్‌లా ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. తాజాగా ఈ ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్పందించాడు.

    క్షేమంగానే ఉన్నాను

    క్షేమంగానే ఉన్నాను

    కారు ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా రాజ్ తరుణ్ స్పందించాడు. ‘నేను క్షేమంగానే ఉన్నాను. సీటు బెల్టు నన్ను కాపాడింది. ప్రమాణం చేసే సమయంలో సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోండి' అని రాసుకొచ్చిన రాజ్ తరుణ్.. ప్రమాదం జరిగిన తీరు.. అక్కడి నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది. తదితర విషయాలను వెల్లడిస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. దీంతో ప్రమాదం ఎవరికి జరిగిందన్న వార్తలకు క్లారిటీ వచ్చేసింది.

    అందరికీ ధన్యవాదాలు

    ప్రమాదం జరిగిన తర్వాత అందరూ రాజ్ తరుణ్ అని అనుకుంటుండడం.. ఛానెళ్లలో ప్రసారం అయిన విజువల్స్‌లో పారిపోతున్న వ్యక్తి రాజ్ తరుణ్ పోలికలతో ఉండడంతో చాల మంది తనకు ఫోన్లు చేసి క్షేమ సమాచారం అడుగుతున్నారని రాజ్ తరుణ్ చెప్పాడు . ‘నాపై చూపుతున్న ప్రేమకు అందరికీ ధన్యవాదాలు. నేను ఎలా ఉన్నాను అని ఫోన్లు చేస్తున్న వారందరికీ థ్యాంక్స్' అని ఆ లేఖలో పేర్కొన్నాడు.

    మూడు నెలలుగా వెళ్తున్నా

    మూడు నెలలుగా వెళ్తున్నా

    కారు ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ.. ‘కారు ప్రమాదం జరిగిన నార్సింగ్ సర్కిల్‌ రోడ్ మార్గంలో నేను మూడు నెలలుగా ప్రయాణం చేస్తున్నాను. కానీ, అప్పుడు అక్కడ ఉన్న కుడివైపు మలుపు వద్ద కారును తిప్పలేకపోయాను. దీంతో కారు ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి లోపలికి దూసుకుపోయింది. అప్పుడు వచ్చిన సౌండ్‌తో నా చెవులు బ్లాక్ అయిపోయాయి. కళ్లు సరిగా కనిపించలేదు. గుండె ఎంతో వేగంగా కొట్టుకుంది. కానీ, సీట్ బెల్ట్ ఉండడంతో నాకు ఏమీ కాలేదు' అని రాజ్ తరుణ్ లేఖ ద్వారా వెల్లడించాడు.

    అందుకే పారిపోయాను

    అందుకే పారిపోయాను

    ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ పారిపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అప్పుడు అతడు మద్యం మత్తులో ఉన్నాడని ప్రచారం జరిగింది. దీంతో ఈ విషయంపైనా అతడు క్లారిటీ ఇచ్చాడు. ‘ప్రమాదం జరిగిన తర్వాత కారు నుంచి కిందికి దిగాను. కారును చూశాను. నాకేమైనా గాయాలయ్యాయేమోనని చూసుకున్నాను. ఆ వెంటనే ఎవరి సహాయమైనా తీసుకుందామన్న ఉద్దేశ్యంతో అక్కడి నుంచి వేగంగా పారిపోయాను. ఆ యాక్సిడెంట్ సమయంలో జరిగింది అంతా ఇదే' అని అతడు చెప్పుకొచ్చాడు.

    త్వరలోనే ప్రారంభిస్తా

    త్వరలోనే ప్రారంభిస్తా

    తాను క్షేమంగానే ఉన్నానని చెప్పిన రాజ్ తరుణ్.. గాయాల విషయం మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, ఆ లేఖ చివర్లో ‘కొద్దిరోజులు విరామం తీసుకున్న తర్వాత నా పనిని తిరిగి ప్రారంభిస్తాను. మీ ప్రేమకు థ్యాంక్స్' తెలిపాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి జీఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

    English summary
    Raj Tarun has acted in 52 short films, and dreamt of becoming a film director. He also worked on the screenplay and dialogues for his first film Uyyala Jampala. In 2015, he acted in Cinema Choopistha Mava and Kumari 21F.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X