మళ్లీ ప్రేమలో పడిన రాజ్ తరుణ్.. ప్రియురాలు ఎవరో తెలుసా?

By Rajababu

Recommended Video

మళ్లీ ప్రేమలో పడిన రాజ్ తరుణ్.. ప్రియురాలు ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో ఎలాంటి వారసత్వం లేకుండా హీరోగా నిలదొక్కుక్కున్న వారిలో రాజ్ తరుణ్ ఒకరు. ఉయ్యాల జంపాలా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన సినిమా చూపిస్తా మావ, కుమారి 21ఎఫ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి.

 లవర్ పేరు ఖరారు

లవర్ పేరు ఖరారు

ఇలా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న రాజ్ తరుణ్ తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం అక్టోబర్ 24 (మంగళవారం) జరిగింది. ఈ చిత్రానికి లవర్ అనే పేరును ఖారారు చేశారు. అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా, హరీష్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

 అనీష్ కృష్ణ దర్శకత్వంలో..

అనీష్ కృష్ణ దర్శకత్వంలో..

అలా ఎలా ఫేం అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రలో మలయాళీ ముద్దుగుమ్మ గాయత్రి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్‌కు లవర్‌గా కనిపించనున్నది.

 గాయత్రి సురేష్ హీరోయిన్‌గా

గాయత్రి సురేష్ హీరోయిన్‌గా

గాయత్రి సురేష్ 2014లో మిస్ కేరళ కిరిటాన్ని గెలుచుకొన్నది. మోడల్ రాణిస్తూనే అరడజన్‌కు పైగా చిత్రాల్లో నటించింది. తాజాగా లవర్‌ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నది.

 కేరళ భామల సందడి

కేరళ భామల సందడి

టాలీవుడ్‌లో కేరళ ముద్దుగుమ్మల హడావిడి ఎక్కువగానే కనిపిస్తున్నది. అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు తొలుత మలయాశంలో సక్సెస్ సాధించి తెలుగు పరిశ్రమకు దిగుమతి అయ్యారు. అలా దిగుమతి అయిన హీరోయిన్ల జాబితాలో చేరిన గాయత్రి సురేశ్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X