Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజ్ తరుణ్ ‘లవర్’ టీజర్.... నా ప్రేమ విశ్వమంత, నువ్వు తప్పించుకోలేవ్!
రాజ్ తరుణ్, రిద్ధికుమార్ జంటగా నటించిన చిత్రం లవర్. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జులై 20న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా 'లవర్' టీజర్ విడుదల చేశారు.
'ఒకప్పుడు గ్రేట్ లవర్స్ స్టోరీస్ చెబుతుంటే నేను కూడా చాలా ఓవర్ గా చెబుతున్నారు అనుకునే వాడిని... అప్పట్లో వాళ్ల ఫీల్ ఇపుడు నేను ఫీలవుతున్నాను'.... 'నా ప్రేమ విశ్వమంత, నువ్వు తప్పించుకోలేవ్' అంటూ టీజర్లో రాజ్ తరుణ్ చెబుతున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
రాజ్ తరుణ్ కంటిన్యూస్ ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా ఈ మూవీ ట్రెండింగ్ అయింది. ఇందుకు కారణం మా బ్యానర్‌కి ఉన్న వేల్యూ అని దిల్ రాజు ఇటీవల ఆడియో వేడుకలో చెప్పుకొచ్చారు. రాజ్‌తరుణ్ తో ఇంతకు ముందే సినిమా చేయాల్సింది. కానీ మిస్ ఫైర్ అయింది. ఇప్పటి నుంచి రాజ్ తరుణ్‌కి సరిపోయే కథలు ఉన్న ప్రతిసారీ సినిమాలు చేస్తామని దిల్ రాజు తెలిపారు.
ప్రేమలోని సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ అనీశ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జూలై 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కెమెరా: సమీర్ రెడ్డి, మ్యూజిక్: అంకిత్ తివారి, రిషి రిచ్, అర్కో, తనీశ్ బాగ్చి, సాయికార్తీక్, బ్యాగ్రౌండ్ స్కోర్: జె.బి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, స్టంట్స్: విజయ్, వెంకట్, రామకృష్ణ, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి, నిర్మాత: హర్షిత్ రెడ్డి, రచన, దర్శకత్వం: అనీశ్ కృష్ణ.