twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ్ తరుణ్ ‘లవర్’ టీజర్.... నా ప్రేమ విశ్వమంత, నువ్వు తప్పించుకోలేవ్!

    By Bojja Kumar
    |

    రాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్ జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ‌ర్‌. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జులై 20న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా 'లవర్' టీజర్ విడుదల చేశారు.

    'ఒకప్పుడు గ్రేట్ లవర్స్ స్టోరీస్ చెబుతుంటే నేను కూడా చాలా ఓవర్ గా చెబుతున్నారు అనుకునే వాడిని... అప్పట్లో వాళ్ల ఫీల్ ఇపుడు నేను ఫీలవుతున్నాను'.... 'నా ప్రేమ విశ్వమంత, నువ్వు తప్పించుకోలేవ్' అంటూ టీజర్లో రాజ్ తరుణ్ చెబుతున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

    Raj Taruns Lover Teaser

    రాజ్ త‌రుణ్ కంటిన్యూస్ ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా ఈ మూవీ ట్రెండింగ్ అయింది. ఇందుకు కారణం మా బ్యాన‌ర్‌కి ఉన్న వేల్యూ అని దిల్ రాజు ఇటీవల ఆడియో వేడుకలో చెప్పుకొచ్చారు. రాజ్‌త‌రుణ్ తో ఇంత‌కు ముందే సినిమా చేయాల్సింది. కానీ మిస్ ఫైర్ అయింది. ఇప్ప‌టి నుంచి రాజ్ త‌రుణ్‌కి స‌రిపోయే క‌థ‌లు ఉన్న ప్ర‌తిసారీ సినిమాలు చేస్తామని దిల్ రాజు తెలిపారు.

    ప్రేమ‌లోని స‌రికొత్త కోణాన్ని ట‌చ్ చేస్తూ అనీశ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని జూలై 20న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కెమెరా: స‌మీర్ రెడ్డి, మ్యూజిక్‌: అంకిత్ తివారి, రిషి రిచ్‌, అర్కో, త‌నీశ్ బాగ్చి, సాయికార్తీక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌: జె.బి, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, స్టంట్స్‌: విజ‌య్‌, వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి, నిర్మాత: హ‌ర్షిత్ రెడ్డి, ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అనీశ్ కృష్ణ‌.

    English summary
    Raj Tarun's Lover Teaser released. The film is directed by Aneesh Krishna and Riddhi Kumar is the heroine. Dil Raju's nephew Harshith Reddy is producing the love story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X