twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి బరిలో రాజ్ తరుణ్.. పవర్‌స్టార్‌ను, నటసింహాన్ని ఢీకొడుతాడా?

    టాలీవుడ్‌లో వరుస విజయాలు సొంతం చేసుకొంటున్న యువ హీరో రాజ్ తరుణ్ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. అయితే పవన్ కల్యాణ్, బాలకృష్ణ చిత్రాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రావడం చర్చానీయాంశమైంది.

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో వరుస విజయాలు సొంతం చేసుకొంటున్న యువ హీరో రాజ్ తరుణ్ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన రాజ్ తరుణ్‌కు అన్నపూర్ణ స్టూడియోస్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ తన మాతృసంస్థలాంటి అన్నపూర్ణలో ప్రస్తుతం రంగులరాట్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలుపాలని నిర్మాతలు నిర్ణయించడం గమనార్హం. అయితే పవన్ కల్యాణ్, బాలకృష్ణ చిత్రాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రావడం చర్చానీయాంశమైంది.

     సంక్రాతికి రంగులరాట్నం

    సంక్రాతికి రంగులరాట్నం

    2017లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది.

     అన్నపూర్ణ బ్యానర్‌లో

    అన్నపూర్ణ బ్యానర్‌లో

    'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ మళ్ళీ రాజ్‌ తరుణ్‌తో చేస్తున్న 'రంగుల రాట్నం' సంక్రాంతి రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

    శ్రీరంజని డైరెక్షన్‌లో

    శ్రీరంజని డైరెక్షన్‌లో

    రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ టోటల్‌గా పూర్తయింది.
    ఫైనల్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

    నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు, సాంకేతికవర్గం

    రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ: ఎల్‌.కె.విజయ్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ఆర్ట్‌: పురుషోత్తం ఎం., నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, దర్శకత్వం: శ్రీరంజని.

    English summary
    After delivering Super Hits 'Ra Randoi Veduka Chuddam','Hello' in 2017, Annapurna Studios latest Production 'Rangula Ratnam' is getting ready to release for Sankranthi. Raj Tharun's, Chitra Shukla played as lead pair in this film Directed by SreeRanjani. Total shooting part has been completed. Film is currently in final stages of post-production work. After Super Hit 'Uyyala Jampala', Annapurna Studios joined again with Raj Tharun for this film, 'Rangula Ratnam' which is getting ready to hit the screens for this Sankranthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X