రాజ్ తరుణ్ జీవితంలో విషాదం..

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన రాజ్ తరుణ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి సంతోష తరుణంలో ఆయన

By Rajababu

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన రాజ్ తరుణ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇలాంటి సంతోష తరుణంలో ఆయన జీవితంలో విషాదం చోటుచేసుకొన్నది. అమితంగా ప్రేమించిన తన పెంపుడు కుక్క మరణించడంతో విషాదానికి లోనైనట్టు తెలిసింది.

రాజ్ తరుణ్‌కు కుక్కలంటే ఇష్టం

రాజ్ తరుణ్‌కు కుక్కలంటే ఇష్టం

సినీ హీరోల్లో ఒక్కొక్కరికి ఓ హ్యాబీ ఉంటుంది. రాజ్ తరుణ్‌కు కుక్కలంటే చాలా ఇష్టం. ఆయన వద్ద చాలా రకాల కుక్కలు ఉన్నాయి. వాటిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొంటాడు. వాటి కోసం ప్రత్యేకంగా ఓ సేవకుడిని ఏర్పాడు చేశాడు. వాటి బాగోగుల కోసం డబ్బుకు వెనుకాడడు.

Recommended Video

Raj Tarun Can Not Resist Stealing Things In His Upcoming Movie "RAJUGADU"
రాజ్ తరుణ్ డబ్బులు పెట్టి

రాజ్ తరుణ్ డబ్బులు పెట్టి

కుక్కలంటే విపరీతంగా ఇష్టం ఉన్న రాజ్ తరుణ్ కొన్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేయగా, మరికొన్నింటిని వీధుల్లో నుంచి తెచ్చుకొని వాటిని పోషిస్తున్నాడట. వాటి కోసం తగు జాగ్రత్తలు తీసుకొంటాడు కూడా.

 రాజ్ తరుణ్‌కు కాలక్షేపం

రాజ్ తరుణ్‌కు కాలక్షేపం

షూటింగ్ లేకపోతే తన పెంపుడు కుక్కలతోనే రాజ్ తరుణ్‌కు కాలక్షేపం. వాటితో ఆడుకోవడం అంటే తనకు ఇష్టమని అప్పుడప్పుడు వెల్లడిస్తుంటాడు. కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో కుక్కపిల్లల్లో ఎక్కువగా రాజ్ తరుణ్ ఇంటిలోనివే.

పెంపుడు కుక్కకు అనారోగ్యం

పెంపుడు కుక్కకు అనారోగ్యం

అయితే తాను అమితంగా పెంచుకొనే కుక్కల్లో ఒకదానికి ఇటీవల జబ్బు చేసింది. దాని సంరక్షణ కోసం దాదాపు రెండు లక్షలకుపైగా ఖర్చు చేశాడట. ఆపరేషన్ కూడా చేయించారట. తన కుక్కను బతికించడం కోసం అన్నీ చర్యలు తీసుకొన్నాడట.

విషాదంలో రాజ్ తరుణ్

విషాదంలో రాజ్ తరుణ్

అయినా తన పెంపుడు కుక్క బతకలేదు. ప్రాణంగా పెంచుకొన్న పెంపుడు కుక్క మరణించడంతో గత మూడు రోజులుగా రాజ్ తరుణ్ విషాదంలో మునిగిపోయాడట. సన్నిహితులు ఎవరు పలకరించినా ఇదే చెప్పుకుని బాధపడుతున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X