twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాళ్‌ఫ్రెండ్‌ని కూడా వదల్లేదుగా: బ్యాగ్‌లో ఉన్న ఫోన్ కొట్టేసిన రాజ్ తరుణ్

    టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజుగాడు’. సంజనారెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా చిత్రయూనిట్ విడుదల చేసింది.

    |

    Recommended Video

    Rajugadu First Look గాళ్‌ఫ్రెండ్‌ బ్యాగ్‌లో ఫోన్ కొట్టేసిన రాజ్ తరుణ్

    టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజుగాడు'. సంజనారెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. రాజుతరుణ్ కు జోడీ అమైరా దస్తూర్‌ నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన 'ఈడోరకం-ఆడోరకం', 'కిట్టుఉన్నాడుజాగ్రత్త', 'అంధగాడు' సినిమాతో ఆ బ్యానర్ హ్యాట్రిక్‌ హీరోగా నిలిచాడు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌త‌రుణ్ చేస్తోన్న చిత్రం 'రాజుగాడు'.యూత్ ఫుల్ కంటెంట్ తో పాటు ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమాలతో కెరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న రాజ్ తరుణ్ మూవీలో సరికొత్తగా కనిపించనున్నాడు.

    ఫస్ట్ లుక్ లోనే మనహీరో క్యారెక్టర్ ని చెప్పేసారు. పిక్ పాకెటర్ టైపు చిలిపి దొంగ గా ఈ పాత్రఉండే అవకాశం ఉంది. గతంలో రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీలో కుక్కలను ఎత్తుకుపోయే వెరైటీ దొంగ పాత్రలో నటించగా.. తాజాగా రాజుగాడులో తన గర్ల్‌ఫ్రెండ్‌ అమైరా దస్తూర్‌‌కి హగ్ ఇస్తూనే హ్యాండ్‌ బ్యాగ్‌లోని సెల్‌ఫోన్‌ను దొంగిలిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ మ్యూజిక్ అందిస్తుండగా.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణంతా పూర్తవడంతో ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    The first look poster of Raj Tarun‏-starrer Rajugadu is released on Wednesday. Directed by Sanjana Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X