Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గాళ్‌ఫ్రెండ్‌ని కూడా వదల్లేదుగా: బ్యాగ్‌లో ఉన్న ఫోన్ కొట్టేసిన రాజ్ తరుణ్
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజుగాడు’. సంజనారెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా చిత్రయూనిట్ విడుదల చేసింది.
Recommended Video
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజుగాడు'. సంజనారెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. రాజుతరుణ్ కు జోడీ అమైరా దస్తూర్ నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన 'ఈడోరకం-ఆడోరకం', 'కిట్టుఉన్నాడుజాగ్రత్త', 'అంధగాడు' సినిమాతో ఆ బ్యానర్ హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌తరుణ్ చేస్తోన్న చిత్రం 'రాజుగాడు'.యూత్ ఫుల్ కంటెంట్ తో పాటు ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమాలతో కెరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న రాజ్ తరుణ్ మూవీలో సరికొత్తగా కనిపించనున్నాడు.
ఫస్ట్ లుక్ లోనే మనహీరో క్యారెక్టర్ ని చెప్పేసారు. పిక్ పాకెటర్ టైపు చిలిపి దొంగ గా ఈ పాత్రఉండే అవకాశం ఉంది. గతంలో రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీలో కుక్కలను ఎత్తుకుపోయే వెరైటీ దొంగ పాత్రలో నటించగా.. తాజాగా రాజుగాడులో తన గర్ల్‌ఫ్రెండ్ అమైరా దస్తూర్‌కి హగ్ ఇస్తూనే హ్యాండ్ బ్యాగ్‌లోని సెల్‌ఫోన్‌ను దొంగిలిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణంతా పూర్తవడంతో ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.