Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఊహించని ప్రశ్నకు హీరో షాక్.. అంత ఆత్రం మంచి కాదు.. నెటిజన్‌కు రాజ్ తరుణ్ కౌంటర్
ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోయాడు. కానీ గత కొన్నేళ్లుగా రాజ్ తరుణ్‌కు హిట్ అని లేకుండా పోయింది. వరుసగా చిత్రలు చేసినా, ప్రయోగాలు చేసినా కూడా ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. చివరగా ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే అనే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ అవి కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్..
రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లో ఉంటాడు. సినిమా అప్డేట్లు ఇస్తుంటాడు. హీరోయిన్లతోనూ ఎంతో జాలీగా ఉంటాడు. తాజాగా రాజ్ తరుణ్ తన ఫాలోవర్లతో ముచ్చటించాడు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ నెటిజన్లకు అదిరిపోయే కౌంటర్లు వేశాడు.
ఫోన్ నంబర్లు..
రాజ్ తరుణ్ కొంత మంది ఫోన్ నంబర్ అడిగేశారు. ఈక్రమంలో శివమణి సినిమాలోని నంబర్‌ను షేర్ చేశాడు. ఆ విషయం తెలియని కొందరు ఆ నంబర్‌కు కాల్ చేశారు. ఆ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందంటూ రాజ్ తరుణ్‌కు మళ్లీ మెసెజ్ చేశారు. అది శివమణి నంబర్ నాది కాదు అంటూ రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు.
ఆ వివరాలు మాత్రం..
గర్ల్ ఫ్రెండ్ ఉందా? పెళ్లి ఎప్పుడు? లవర్ పేరు చెప్పండి? అని అడిగిన ప్రశ్నలకు మాత్రం రాజ్ తరుణ్ తప్పించుకున్నాడు. అలాంటివేమీ లేవని చెప్పుకొచ్చాడు. ఇక తన తదుపరిచిత్రాల గురించి అప్టేట్లు ఇచ్చాడు.అరియానా గురించి అడిగితే.. అమేజింగ్ అంటూ చెప్పుకొచ్చాడు.
వర్జినా? అంటూ..
ఆర్ యూ వర్జిన్ అంటూ కొందరు నెటిజన్లు రాజ్ తరుణ్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు షాకైన రాజ్ తరుణ్ అదిరిపోయే కౌంటర్ వేశాడు. నా గురించి మీరు ఏం అనుకుంటున్నారు? అని అడిగేశాడు. మరో నెటిజన్ మళ్లీ వర్జినా? అని అడిగితే.. అంత ఆత్రం మంచిది కాదు అంటూ హితవుపలికాడు.
సినిమాల గురించి..
మళ్లీ హెబ్బా పటేల్తొ సినిమా ఎప్పుడు? అవికా గోర్‌తో మళ్లీ కలిసి ఎప్పుడు నటిస్తున్నావ్ అని అడిగితే.. త్వరలోనే అని సమాధానం చెప్పాడు. అవికా గోర్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.