Don't Miss!
- News సంచలన నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' ట్రైలర్.. ఓటీటీలో అయినా హిట్ కొడతాడా?
వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న హీరోల్లో రాజ్ తరుణ్ ఒకడు. ఈ హీరో సక్సెస్ చూసి ఏళ్ళు గడుస్తోంది. కమిట్మెంట్స్ కారణంగా రాజ్ తరుణ్ చేసిన కొన్ని సినిమాలు అతని కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఇక ఎలాగైనా నెక్స్ట్ ఒరేయ్ బుజ్జిగా సినిమాతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ సందడి చేయాలని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు కరోనా దెబ్బ కొట్టడంతో డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని అక్కినేని హీరో నాగచైతన్య చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. రాజ్ తరుణ్ హీరోగా మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాకు విజయ్ కుమార్ కొండా దర్శకుడు. ఇక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ చైతన్య సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ కి తన బెస్ట్ విషెస్ అందించారు.
ట్రైలర్ విషయానికి వస్తే సినిమా ఒక డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు అర్ధమవుతోంది. మంచి కామెడీ సీన్స్ తో పాటు, రొమాంటిక్ లవ్ ఎపిసోడ్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. ప్రముఖ కమెడియన్స్ తో పాటు పోసాని కృష్ణమురళి, వాణీ విశ్వనాథ్, నరేష్ వంటి సీనియర్ యాక్టర్స్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇక సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. గాంధీజయంతి సందర్భంగా ఆహా యాప్ లో అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక డైరెక్టర్ విజయ్ కుమార్ తోనే రాజ్ తరుణ్ ఇటీవల మరో సినిమాను స్టార్ట్ చేశాడు. ఆ సినిమా రొమాంటిక్ యాంగిల్ లో కాకుండా కాస్త మాస్ స్టైల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు సమాచారం.