twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారూక్‌ ఖాన్ టెర్రరిస్టు కాదు..నిషేధం వద్దు

    By Srikanya
    |

    ముంబయి : బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో.. నేరస్థుడో కాదు.. ఆయన్ను వాంఖడే స్టేడియంలోకి ప్రవేశాన్ని నిషేధించడం సబబు కాదు.. ఆయన ఓ క్రికెట్‌ జట్టుకు యజమాని.. తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో ఆయనను అనుమతించాల్సిందే' అంటూ ఎమ్మెన్నెస్‌ అధినేత రాజ్‌ థాకరే వ్యాఖ్యానించారు.

    గత ఏడాది ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు జరుగుతుండగా నటుడు షారుక్‌ మద్యం తాగి వస్తున్నారంటూ వాంఖడే స్టేడియం సెక్యూరిటీ గార్డు ఆపేయడంతో బాలీవుడ్‌ బాద్‌షా వారితో గొడవపడ్డాడు. దీంతో షారుక్‌ ఐదేళ్లపాటు స్టేడియంలోకి అడుగుపెట్టకూడదంటూ ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) నిషేధాజ్ఞలు జారీ చేసింది.

    ప్రస్తుతం వివాదాస్పదమౌతున్న ఈ అంశంపై స్పందించిన ఎంపీసీసీ ఇటీవల ఎంసీఏకు లేఖ రాస్తూ.. షారుక్‌ను క్షమించి స్టేడియంలోకి అనుమతించాలని లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజ్‌థాకరే సైతం షారుక్‌కు అండగా నిలిచారు. మీడియాతో మాట్లాడుతూ.. స్టేడియంలోకి రాకుండా చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తాజా పరిణామాలతో ఎంసీఏ షారుఖ్‌ను మన్నించి వాంఖడే స్టేడియంలోకి ప్రవేశం కల్పిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

    ఐపియల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను వాంఖడే స్టేడియంలోకి రానీయొద్దని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) స్థానిక పోలీసులకు సూచించింది. ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్ రెడర్స్ మంగళవారం ఐపియల్ మ్యాచులో తలపడుతున్న విషయం తెలిసిందే.

    English summary
    
 Actor Shah Rukh Khan, owner of the Kolkata Knight Riders or KKR, will not be cheering for his cricket team when it takes on the Mumbai Indians at the Wankhede Stadium. That's "childish," says Raj Thackeray, chief of the Maharashtra Navnirman Sena or MNS. In a surprise move, the politician batted for the actor, and said, "Whatever happened last time happened. It's childish to hang on to it. Is he a terrorist, that you won't allow him to come back... and let him watch the match?"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X