twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి మరణంపై మరో వివాదం.. అక్షయ్‌కుమార్‌పై విమర్శలు.. జాతీయ జెండాపై..

    |

    Recommended Video

    శ్రీదేవి పై జాతీయ జెండా కప్పాల్సిన అవసరం ఏముంది : నరేంద్ర మోడీ ప్లాన్

    అతిలోక సుందరి శ్రీదేవి మృతి వార్త ఎదో విధంగా ఇప్పటికి వార్తల్లో నిలుస్తూనే ఉంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే ప్రభుత్వం శ్రీదేవి అంత్యక్రియలు జరిపిన విధానంపై నిప్పులు చెరిగారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంగా రాజ్ థాక్రే శ్రీదేవి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆయన వ్యాఖ్యలు సినీరాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీదేవి గత నెల 24 న దుబాయ్ లో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతితో సినీలోకం మొత్తం తల్లడిల్లింది.

    అకాల మరణంతో

    అకాల మరణంతో

    శ్రీదేవి అకాల మరణంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులంతా షాక్ కి గురయ్యారు. శ్రీదేవి మృతి తరువాత మూడు రోజులపాటు దుబాయ్ లో అనూహ్య పరిణామాల చోటుచేసుకున్నాయి.

    మీడియాలో ఉహాగానాలు

    మీడియాలో ఉహాగానాలు

    దుబాయ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత మీడియా పలు ఊహాజనిత కథనాల్ని ప్రసారం చేసిందనే వాదన ఉంది. శ్రీదేవి అభిమానులు అసలు ఏం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసారు.

    రాజ్ థాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు

    రాజ్ థాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు

    శ్రీదేవి పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడంతో ఆమె అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణసేన అధ్యక్షుడు రాజ్ థాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

    త్రివర్ణ పతాకం ఎందుకు కప్పారు

    త్రివర్ణ పతాకం ఎందుకు కప్పారు

    శ్రీదేవికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని రాజ్ థాక్రే అన్నారు. శ్రీదేవి దేశం కోసం ఏం చేసిందని ఆమెపై త్రివర్ణ పతాకాన్ని కప్పారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు.

    మీడియా ఎందుకు అలా చేసింది

    మీడియా ఎందుకు అలా చేసింది

    దేశ ఆర్థిక వ్యవస్థకు గండి కొట్టి, పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాములో ఇరుక్కున్న నిరవ్ మోడీ వార్తలని ప్రసారం చేయకుండా మీడియా మొత్తం శ్రీదేవి మృతికి ప్రాధాన్యత కల్పించడంలో అర్థం ఏమిటని రాజ్ థాక్రే అన్నారు.

    అంతా మోడీ ప్లానింగ్

    అంతా మోడీ ప్లానింగ్

    నీరవ్ మోడీ వార్తలు ప్రసారం అయితే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతోనే నరేంద్ర మోడీ మీడియాపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు. అందుకే మీడియా నీరవ్ మోడీ విషయాన్ని పక్కన పెట్టి శ్రీదేవి మృతికి అధిక ప్రాధాన్యత కల్పించారని అన్నారు.

    అక్షయ్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్యలు

    అక్షయ్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్యలు

    రాజ్ థాక్రే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని కూడా వదల్లేదు. అక్షయ్ కుమార్, మోడీ ప్రభుత్వానికి రహస్య ఒప్పందాలు ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసారు. అక్షయ్ కుమార్ చేస్తున్న చిత్రాలు మోడీకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మాన్ చిత్రాలు అలాంటివే అని అన్నారు.

    English summary
    Raj Thackeray questions why Sridevi was given a state funeral. He made controversial comments on Sridevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X