Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజ్ తరుణ్ మామూలోడు కాదు, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Recommended Video
ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు, నటుడు కావాలనే తపన, అందుకు కావాల్సిన టాలెంటు తప్ప. ఇవన్నీ ఉన్నా కూడా అందరికీ అన్నీ కలిసి రావు. వేలల్లో ఒక్కరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. ఇండస్ట్రీలో స్టార్లు అయిపోతారు. అలాంటి అదృష్ట వంతుల్లో రాజ్ తరుణ్ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐదేళ్ల క్రితం 'ఉయ్యాలా జంపాల' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం టాలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న కుర్ర హీరోల్లో ఒకరిగా మారాడు.
వరుస విజయాలు
2013లో ‘ఉయ్యాలా జంపాలా' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన రాజ్ తరుణ్ తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుని వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే యుత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
సినిమాల్లోకి రాక ముందు 52 పైగా షార్ట్ ఫిల్మ్స్
టీనేజ్ వయసు నుండే సినిమాలంటే ఇష్టం పెంచుకున్న రాజ్ తరుణ్.... హీరోగా తెరంగ్రేటం చేయక ముందు 52 షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. వాటిలో నటించిన అనుభవంతో తొలి చిత్రంలో తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఎకె ఎంటర్టెన్మెంట్స్ భారీ డీల్
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమావ, కుమారి 21 ఎఫ్ వరుస విజయాల తర్వాత..... అనిల్ సుంకర లీడ్ చేస్తున్న ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు రాజ్ తరుణ్ తో మూడు సినిమాలతో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రాజుగాడు చిత్రాలు సైన్ చేశాడు. రెండు చిత్రాలు ఇప్పటికే విడుదలవ్వగా.... రాజుగాడు చిత్రం త్వరలో విడుదల కానుంది.
డీల్ విలువ ఎంతో తెలుసా?
ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు.... రాజ్ తరుణ్‌తో మూడు సినిమాలను రూ. 3 కోట్లతో డీల్ చేసుకున్నారట. అంటే ఒక్కో సినిమాకు రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నాడన్నమాట.
ఖరీదైన విల్లా...
రాజ్ తరుణ్ రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ బదులుగా అంతే విలువ చేసే ఖరీదైన విల్లాను అనిల్ సుంకర నుండి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి సినీ ఇండస్ట్రీ వారు ఆశ్చర్యపోతున్నారు.
రిజక్ట్ చేసిన రాజ్ తరుణ్
3 సినిమాల అనంతరం రాజ్ తరుణ్‌తో మరో సినిమా చేయడానికి ‘ఎకె ఎంటర్టెన్మెంట్స్' వారు డీల్ కుదుర్చుకున్నారని, అయితే పలు కారణాలతో రాజ్ తరుణ్ వారి ప్రతి పాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.