twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ్ తరుణ్ గురించి గుర్తు చేసుకొని రాజా రవీంద్ర కంటతడి... ఏం జరిగిందంటే

    టాలీవుడ్‌లో ఎలాంటి క్యారెక్టర్లనైనా పండించే సత్తా ఉన్న నటుల్లో రాజా రవీంద్ర ఒకరు. చాలా ఏళ్లుగా వైవిధ్యమున్న పాత్రలు పోషించారు.

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో ఎలాంటి క్యారెక్టర్లనైనా పండించే సత్తా ఉన్న నటుల్లో రాజా రవీంద్ర ఒకరు. చాలా ఏళ్లుగా వైవిధ్యమున్న పాత్రలు పోషించారు. ఇటీవల అంధగాడు చిత్రంలో రాజా రవీంద్ర పోషించిన పూర్తి స్థాయి విలన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒకప్పడు రాజ తరుణ్ దీన స్థితిని చూసి కంటతడి పెట్టారు. ప్రస్తుతం రాజా రవీంద్ర రాజ్ తరుణ్‌తోపాటు పలువురు హీరోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

    డబ్బుతోపాటు గుర్తింపు

    డబ్బుతోపాటు గుర్తింపు

    మిగితా ఉద్యోగాలు చేయడం వల్ల డబ్బు వస్తుందేమో కానీ గుర్తింపు పెద్దగా ఉండదు. సినిమా నటుడిగా మారడం వల్ల ముఖ్యమంత్రి నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ గుర్తుపడతారు. అందుకే సినిమా ఫీల్డ్ అంటే అంతగా ఇష్టపడుతారు. ఇక్కడ సినిమాలో నటించడం వల్ల విపరీతంగా డబ్బు వస్తుంది. అంతకంటే ఎక్కువగా పబ్లిసిటీ వస్తుంది.

    గోల్ పెట్టుకొనే ముందు..

    గోల్ పెట్టుకొనే ముందు..

    సినిమాను వృత్తిగా ఎంచుకోవడానికి ముందు మనలో ఎంత సత్తా ఉంది. మనమేంటీ అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. రాజ్ తరుణ్ వైజాగ్ నుంచి వచ్చి హీరో అయిపోయాడు అని అందరు అనుకొంటారు కానీ అలా కాదు. ఆయన హీరోగా ఎప్పుడు ఉన్న స్థాయిని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.

    అందమేకాదు.. అదృష్టం కూడా..

    అందమేకాదు.. అదృష్టం కూడా..

    రాజ్ తరుణ్ లాంటి హీరో అయినప్పుడు నాకేమి తక్కువ అనుకోవద్దు. అందంగా ఉండగానే హీరో కాలేరు. అందం కేవలం ముఖ్యం కాదు. అదృష్టం కూడా కలిసి రావాలి. రాజ్ తరుణ్ హీరో కావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు రాజ్ తరుణ్‌ను చూసి సింపుల్‌గా హీరో అయిపోయాడని అనుకొంటారు. అతను హీరో కావడం వెనుక భయంకరమైన విషయాలు ఉన్నాయి.

    అసిస్టెంట్‌గా చేరి

    అసిస్టెంట్‌గా చేరి

    సినిమాల్లో నటించడం కోసం రాజ్ తరుణ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిపోయాడు. హీరోయిన్లకు ఆడిషన్ జరుగుతుండగా వారి పక్కన హీరోగా నటించాడు. అతను అసిస్టెంట్‌గా చేరిన సినిమా ఆగిపోయంది. జీతం కూడా ఇవ్వలేదు.

    ఇంటి కిరాయి కట్టలేక రోడ్డుపై

    ఇంటి కిరాయి కట్టలేక రోడ్డుపై

    ఆ తర్వాత తాను ఇంటి కిరాయి కట్టలేక ఇల్లు కాలి చేసి పదిహేను రోజులు రోడ్డు మీద పడుకొన్నారు. పది రోజులకు పైగా సరిగా తిండి లేదు. ఆ తర్వాత సినిమా ప్రారంభమవుతుందని కబురు పెట్టడానికి వచ్చిన వ్యక్తి రోడ్డుపై పడిపోయిన రాజ్ తరుణ్‌‌ను చూసి షాక్ అయ్యాడు. అలాంటి పరిస్థితి నుంచి రాజ్ తరుణ్ ఈ రోజు హీరో స్థాయికి చేరుకొన్నాడు అని రాజా రవీంద్ర కంటతడి పెట్టుకొన్నాడు.

    English summary
    Raja Ravindra tells about Raj Tharun's situation which happen few years ago. He said film industry gives fame and name if one succeed. He given a example for hard work behind Raj Tharun's success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X