గర్ల్ ఫ్రెండ్ శ్రద్ధ శర్మపై దాడి చేసిన నటుడు రాజా చౌదరి
నటుడు రాజా చౌదరి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తన ఓషివారా నివాసంలో రాజా చౌదరి తన గర్ల్ ఫ్రెండ్ అయిన మోడల్ శ్రద్ధ శర్మపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రాజా చౌదరి శ్రద్ధను తీవ్రంగా కొట్టాడని, ఆమెకు అంధేరిలోని సుజొయ్ ఆస్పత్రిలో చికిత్స జరిగిందని ఓషివారా పోలీసులు చెప్పారు. ఓషివారా సీనియర్ పోలీసు ఇన్ స్పెక్టర్ డి రూపవతి ఆ సంఘటనను ధ్రువీకరించారు. ఇద్దరి మధ్య గల వ్యక్తిగత సమస్యల వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందని రూపవతి చెప్పారు. అయితే, ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు. శ్రద్ధ శర్మ కూడా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
బాలీవుడ్ శ్రద్ధ శర్మ రాజా చౌదరి ఓషివారా పోలీసులు bollywood shraddha sharma raja chaudhary oshiwara police


Click it and Unblock the Notifications