అంత బావుందా? ‘రాజా చెయ్యి వేస్తే’ ట్రైలర్‌కు రెస్పాన్స్ కేక!
హైదరాబాద్: నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యి వేస్తే'. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం విజయవాడలో జరిగింది.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నారారోహిత్, తారకరత్న, దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, సాయికొర్రపాటి, ఇషా తల్వార్, భాస్కర్ సామల, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, సాయికార్తీక్, డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు, కాసర్ల శ్యామ్, కారుమంచి రఘు తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు.
ట్రైలర్ కు రెస్పాన్స్ బావుంది. ట్రైలర్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 75 వేలకు పైగా హిట్స్ వచ్చాయి. ఒక రోజు గడిచేలోపే ఈ ట్రైలర్ చూసిన వారి సంఖ్య లక్ష దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం, హీరో నారా రోహిత్ తో సమానంగా తారకరత్న విలనిజం ఉండటంతో మరింత ఆసక్తిని రేపుతోంది.
మురారి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తనదైన శైలితో రాణిస్తున్న సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాటోగ్రఫీ హైలెట్ అవుతుందని స్పష్టమవుతోంది. ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











