'బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై' చిత్రంతో పరిచయమైన మేడిన్ కర్ణాటక భామ సంజన ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టింది. ఆ చిత్రం పేరు 'సమర్ధుడు'. 'ఆనంద్' సినిమా తర్వాత చెప్పుకోవటానికి ఒక్క హిట్టూ సంపాదించుకోని రాజా హీరోగా చేస్తున్న చిత్రమిది. తాజాగా అతను సెక్సీ హీరోయిన్ నమిత,మీరాచోప్రాలతో 'జగన్మోహిని' చిత్రంలో చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు తో సంజనతో స్క్రీన్ రొమాన్స్ చేయనున్నాడు. వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ సినిమాతో అర్జున్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. అలాగే ఈ చిత్రంలో చాలా గ్యాప్ తో రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రత్యేక పాత్రతో కనిపించబోతున్నారు.