రాజా, మంజరి 'ఇంకోసారి' మ్యాటర్ ఏంటి?

By Srikanya

రాజా, మంజరి జంటగా సుమన్‌ పాతూరి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ 'ఇంకోసారి' చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కధ గురించి నిర్మాత చెబుతూ.. 'కాలేజీలో సరదాగా గడిపిన ఫ్రెండ్స్‌ ఆ తర్వాత ఎక్కడెక్కడో సెటిలవుతారు. ఫ్రెండ్స్‌తో ఇంకోసారి సరదాగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలా ఇంకోసారి కలుసుకున్న స్నేహితుల కథే ఈ చిత్రం. ఆ కలయిక వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది..స్నేహం నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా ఉండే చిత్రమిది...అంటున్నారు.

అలాగే ఈ ఇంకోసారి చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్త చేసుకుని విడుదలకు రెడీ అయింది. ఈ చిత్రం ఆడియోను నవంబర్‌ 4న జంగ్లీ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. మహేష్‌ శంకర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో రాజా మాట్లాడుతూ, 'దాదాపు నాలుగేళ్ళ తర్వాత మళ్లీ 'వెన్నెల' టీమ్‌తో, అదే స్పిరిట్‌తో ఈ సినిమా చేశాను. 'వెన్నెల' స్థాయిలోనే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను' అన్నారు. దర్శకుడు సుమన్‌ పాతూరి మాట్లాడుతూ, 'స్నేహం, వినోదం, మంచి సంగీతం ఈ బిజీ జీవితంలో సేద తీరడానికి ఎవరైనా కోరుకునేవి. ఈ మూడు అంశాలూ ప్రధానంగా, ఆహ్లాదభరితంగా ఈ సినిమా ఉంటుంది' అని తెలిపారు. బెస్టాఫ్ లక్ సుమన్ పాతూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X