టాప్ టీమ్ తో ఎన్నారై సినిమా

మొదటి సారి అవకాశం మిస్సవగానే జీవితం అంతటితో అయిపోదు. ప్రతీదానికి సెకెండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. అందులోనూ జీవితం అంటే ఇంపార్టెంట్ మేటర్ లో అయితే మరీనూ. అయితే సెకెండ్ ఛాన్సెస్ తనంతట తాను మనదగ్గరకి రాదు. అది అరుదైన అవకాశం . వాటిని మనమే అందుకోవాలి...క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనం మిస్సయ్యామనుకుంటున్న జీవన సంగీతం,హాస్యం,స్నేహం అన్నీ ఒక్కసారిగా పురివిప్పుకుని నెమలి ఫించంలా మన ముందు నిలబడతాయి....అంటూజీవితానికి సంభందించిన మంచి ఫిలాసపీ తో వస్తున్న ఈ సినిమా మంచి విజయవంతంకావాలని కోరుకుందాం.
డైలాగులు రచయితగా గమ్యం ఫేమ్ గంధం నాగరాజు,సంగీత దర్శకుడు గా వెన్నెల ఫేమ్ మహేష్ శంకర్, కధను ప్లేవర్స్ వంటి ఎన్నారై ఫిల్మ్ ఇచ్చిన రాజ్ మరియు డి.కె అందిస్తున్నారు. ఇక ఛాయాగ్రహణంని పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్,సంతోష్ శివన్ అసెస్టెంట్ అయిన రంగ, కొరియోగ్రఫి రాజు సుందరం,స్క్రీన్ ప్లై డికె,సీతా మీనన్ నిర్వహించనున్నాడు. ఇక షూటింగ్ ని డిసెంబర్ రెండు నుంచి ప్రారంభించనున్నారు.ఇక సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు,ఇప్పుడిప్పుడే ఎదుగుతూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న రావు రమేష్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











