రాజమౌళి తో సినిమాపై పవన్ కళ్యాణ్
రాజమౌళితో సినిమా ఎప్పుడు అని అభిమానులందరూ అడుగుతున్నారు. రాజమౌళితో సినిమా చేయాలని నాకూ ఉంది. దేశం గర్వించే సినిమా 'మగధీర' తీసినప్పుడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించాను.అయితే నేనెవర్నీ సినిమా చేయమని నోరు తెరిచి అడగలేను.అన్నీ కలిసి రావాలి.ఆయనతో సినిమా చేయాలంటే సరైన సమయం రావాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం పంజా ఆడియో పంక్షన్ లో ఈ విషయం చెప్పారు.ఇక గతంలోనూ రాజమౌళి ఈ విషయమై మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రపోజల్ ప్రస్తుతానికి లేదని, ఒకవేళ మా కాంబినేషన్ లో సినిమాలో సెట్ అయితే ఆ విషయాన్ని నేనే చెపుతానని రాజమౌళి ఇంతకుముందో సారి ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
అప్పటి నుంచి అబిమానులకు రాజమౌళి దర్శకత్వంలో పవన్ సినిమా చూడాలని కుతూహలపడుతున్నారు.ఇక పంజా స్టేజిపై రాజమౌళి ప్రసంగిస్తూ ''నిర్మాత శోభు నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు రకరకాల టైటిళ్లు వినిపించారు.ఏదీ నచ్చలేదు. కానీ 'పంజా'అని టైటిల్ కార్డు చూపించగానే బాగా నచ్చింది.పవన్ కల్యాణ్‌తో సినిమా తీయడం నా చేతుల్లో లేదు.అది ఆయన చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రస్తుతం రాజమౌళి తన తాజా చిత్రం ఈగ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.సమంత,నాని కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మార్కెట్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.అలాగే పంజా నిర్మాతలతో గతంలో రాజమౌళి మర్యాద రామన్న చిత్రం రూపొందించారు.


Click it and Unblock the Notifications











