రాజమౌళి మరో నిక్ నేమ్
ప్రముఖ దర్శకుడు రాజమౌళిని పరిశ్రమలో చాలా మంది 'జక్కన్న'(అంటే సినిమాను శిల్పంలా శ్రధ్దగా చెక్కుతాడని) అనే నిక్ నేమ్ తో పిలుస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్య రమా మాత్రం ఆయన్ని 'డూ డూ' అని పిలుస్తానని రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.డూడూ అనే పక్షి మెల్లిగా,బద్దకంగా ఉంటుందిట. అదేంటి అంత షార్ప్ గా ఉంటే రాజమౌళికి ఆ నిక్ నేమ్ అంటే ఆమె నవ్వేసారు. అలాగే రాజమౌళి ఆమెను చిన్నీ అని ముద్దు పేరుతో పిలుస్తారు. వీటికి తోడు రాజమౌళిని చిన్నప్పటి నుంచీ ఇంట్లో వాళ్ళు నంది అని నిక్ నేమ్ తో పిలుస్తూంటారు.ఇక రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా రూపొందించబోయే 'మర్యాద రామన్న' చిత్రం హడావిడిలో ఉన్నారు. 'మగధీర' విజయం తో ఆయన మరో మెట్టు ఎక్కారు.
More from Filmibeat
rajamouli dodo rama wife nickname nandi magadheera maryadaramanna sunil మర్యాద రామన్న రాజమౌళి జక్కన్న సునీల్ మగధీర


Click it and Unblock the Notifications











