ఇంకొక్కసారి... అంటున్న

ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ''నేను నటించిన 'వెన్నెల'కి దర్శకత్వ శాఖలో సుమన్ పని చేశాడు. ఈ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంద''న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''కాలం మనిషిలో తెచ్చే మార్పులు, అనుభూతులు, పరిణామాల్ని చూపించే చిత్రమిది. కాలేజీ వదిలేసిన కొన్నేళ్లకు మిత్రులందరూ కలుసుకొంటే దొర్లే అనుభూతులూ, సరదాలూ అన్నీ తెర మీద కనిపిస్తాయి. అవి చూశాక ఇంకొక్కసారి ఆ రోజులు వస్తే బాగుణ్ను అనిపిస్తాయ''న్నారు.
''వెన్నెల నిర్మాణంలో పాలుపంచుకున్నాను. 'గమ్యం'తో పంపిణీదారుడిగానూ మారాను. ఇప్పుడు దర్శకుడి ప్రతిభపై నమ్మకంతో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించాను'' అన్నారు నిర్మాత. రవివర్మ, వెన్నెల కిషోర్, సాందీప్, రావు రమేష్, గొల్లపూడి మారుతీరావు, భార్గవి, సైరాభాను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్ శంకర్, పాటలు: వనమాలి, కథ-స్క్రీన్‌ప్లే: రాజ్ డి.కె., సీతా మీనన్; మాటలు: నాగరాజు గంధం, ఛాయాగ్రహణం: రంగనాథ్‌బాబు.జి.


Click it and Unblock the Notifications











