నయనతార-ఆర్య రియల్ లైఫ్‌కు దగ్గరగా ప్రేమ.. (ఫోటోలు)
హైదరాబాద్: నయనతార, ఆర్య జంటగా నటించిన 'రాజారాణి' తమిళ సినిమా ఆ మధ్య భారీ విజయాన్ని నమోదు చేసింది. సెప్టెంబర్ 27, 2013న విడుదలైన ఈ సినిమా తమిళంలో సుమారు 50 కోట్లపైనే వసూలు చేసింది. నూతన దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మించిన ఈ సినిమా విజయం నయనతారకు బాగా ప్లస్ అయింది. జై, నజ్రియా నజీమ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
త్వరలో ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్వంటియెత్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి తెలుగులో అనంత శ్రీరామ్ పాటలను రాసారు. జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి తెలుగు రానా ముఖ్య అతిథిగా హాజరై సీడీలను ఆవిష్కరించారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

నయనతార-ఆర్య మధ్య రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే ప్రేమ
సినిమా గురించి ఆర్య మాట్లాడుతూ....ఈ సినిమా చూస్తున్నంత సేపు రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే ప్రమను చూపించాం. చాలా పెద్ద స్టార్ కాస్ట్. నయనతారతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.

దర్శకుడు అట్లీ కుమార్ మాట్లాడుతూ..
ఇదొక ఎమోషనల్ రొమాంటిక్ కామెడీ సినిమా. తమిళంలో మంచి ప్రేక్షకాదరణ లభించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన మురుగదాస్, ఫాక్స్ ఇండియా వారికి అట్లీ కుమార్ థాంక్స్ చెప్పారు.

సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మాట్లాడుతూ...
అనంత శ్రీరామ్ చక్కని లిరిక్స్ ఇచ్చాడు. తమిళంలో సాంగ్స్ పెద్ద హిట్టయ్యాయి. తెలుగులోనూ పాటలు అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను అన్నారు.

రానా మాట్లాడుతూ...
నేను రెగ్యులర్‌గా తమిళ సినిమాలు చూస్తుంటాను. కానీ ఈ సినిమాను కొన్ని కారణావల్ల మిస్ అయ్యాను. సినిమా మంచి టాక్ వచ్చిందని విన్నాను. తెలుగులో విడుదలైన రోజే తప్పకుండా చూస్తాను అన్నారు.

స్టోరీ ఏంటి?
ప్రియురాలిని కోల్పోయిన హీరో, ప్రియడుని కోల్పోయిన హీరోయిన్ వీరిద్దరికి అనుకోని పరిస్థితిలో పెళ్లి జరుగుతుంది. వారి ప్రేమని మరచిపోలేని వారిద్దరి మధ్య దాంపత్య జీవితం ఎలా సాగింది. అనే అంశాన్ని కలర్‌ఫుల్‌గా, యూత్‌ఫుల్ రోమాంటిక్ ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు అట్లీకుమార్ అద్భుతంగా తెరకెక్కించారు.

అందరికీ నచ్చే విధంగా..
ప్రతీ సన్నివేశం ఎంతో ఆసక్తితో తెరకెక్కించడం జరిగిందని, ప్రతి ప్రేక్షకుడినీ ఆలోచింపజేసేలా సన్నివేశాలు సాగుతాయి. ఇది యువతను, కుటుంబ సభ్యులను పూర్తిగా ఆకట్టుకుంటుందని. రోటీన్‌గా వస్తున్న చిత్రాలకు చాలా భిన్నంగా ఈ చిత్రం వుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











