twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార "రాజా రాణి'' స్టోరీ లైన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రియురాలిని కోల్పోయిన హీరో, ప్రియుడిని కోల్పోయిన హీరోయిన్ వీరిద్దరికి అనుకోని పరిస్థితిలో పెళ్ళి జరుగుతుంది. వారి ప్రేమలను మరచి పోలేని వారిద్దరి మధ్య దాంపత్య జీవితం ఎలా సాగింది. అనే అంశాన్ని కలర్ ఫుల్ గా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. అదే ఆర్య, నయనతార టైటిల్ రోల్స్ చేసిన 'రాజా రాణి' కాన్సెప్టు. ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ నిర్మాణంలో 'గజిని', 'ఠాగూర్' వంటి సంచలన చిత్రాల దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో రాబోతోంది. ఈ నెల 14న అత్యధిక థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది.

    ఫాక్స్ స్టూడియోస్ సిఎఫ్ ఓ శ్రీరామకృష్ణ మాట్లాడుతూ... గజిని, ఠాగూర్ వంటి సంచలన విజయాల దర్శకుడు మురుగదాస్ సమర్పణలో గతంలో జర్నీ వంటి సూపర్ హిట్ తర్వాత మా కాంబినేషన్ లో వస్తున్న మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం రాజా రాణి తమిళనాడులో విడుదలై సంచలన విజయం సాధించి దాదాపు 55 కోట్లు వసూలు చేసిన చిత్రమిది. జి.వి.ప్రకాష్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆరు పాటలను మొత్తం పాటలను అనంత శ్రీరామ్ రాయగా జి.వి.ప్రకాష్, ఐశ్వర్య,జై. శ్రీనివాస్. శక్తి శ్రీగోపాలన్,రాహుల్ నంబియార్, మేఘ, క్లిన్ టన్, వందన శ్రీనివాసన్, విజయ్ ప్రకాష్,రనీనా రెడ్డి, నల్ మాల్, కాల్ గాడె,సష వంటి ప్రముఖ గాయనీ గాయకులు పాడటం జరిగింది.

    Raja Rani Releasing On 14th March

    మురుగదాస్ మాట్లాడుతూ "ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. ప్రియురాలిని కోల్పోయిన హీరో ప్రియుడిని కోల్పోయిన హీరోయిన్ అనుకోని పరిస్థితుల్లో వీరి పెళ్ళి జరుగుతుంది. వారి పాత ప్రేమను మరచి పోలేని వారిద్దరి దాంపత్యం ఎలా జరుగుతుంది. అనే అంశాన్ని చిత్ర దర్శకుఉడు అట్లీ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తితో తెరకెక్కించాడు. అన్యోన్యత కోల్పొయిన భార్య భర్తల మధ్య సాగే సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది. రొటీన్ గావస్తున్న చిత్రాలకు చాలా భిన్నంగా ఈ రాజా రాణి చిత్రం ఉంటుంది. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ...అన్యోన్యత కరువైన భార్యాభర్తల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే అంశానికి మేళవించిన సెంటిమెంట్ అందరి హృదయాల్నీ స్పృశిస్తుంది. తమిళ ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుందో, అంతకు మించి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం సినిమాకి ఎస్సెట్. త్వరలోనే చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

    హాలివుడ్ చిత్రాల సంస్థ ట్వంటీ యత్ సెంచరీ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణంలో గజని,ఠాగూర్ వంటి సంచలన విజయాల దర్శకుడు మురుగదాస్ సమర్పణలో గతంలో జర్నీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన కాంబినేషన్ లో వస్తున్న మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం "రాజా రాణి'' తమిళనాడులో విజయవంతమై దాదాపు నలభై కోట్లకు పైగా విడుదల చేసింది. జై, నజ్రియా నజీమ్, సత్యరాజ్, సంతానం, మనోబాల, సత్యన్, ధన్య బాలకృష్ణన్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జార్జి సి. విలియమ్స్, కూర్పు: ఆంథోనీ ఎల్. రూబెన్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్.

    English summary
    Raja Rani' starring Arya, Nayan Tara, Jai, Najriya, Satya Raj etc was a sleeper hit in Tamil in 2013. The film's Telugu version with a stellar ensemble cast led by Nayanthara, Arya and featuring Jai , Nazriya, Santhanam and Sathyaraj making it one of the most awaited films of the year is to be released on the 14th March.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X