»   » ప్రేమికులరోజున నయనతార కొత్త చిత్రం టీజర్

ప్రేమికులరోజున నయనతార కొత్త చిత్రం టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆర్య, నయనతార టైటిల్ రోల్స్ చేసిన 'రాజా రాణి' చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ నిర్మాణంలో 'గజిని', 'ఠాగూర్' వంటి సంచలన చిత్రాల దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో రాబోతోంది. ఈ చిత్రం టీజర్ ని ప్రేమికుల రోజు అంటే పిభ్రవరి 14న విడుదల చేయాలని నిర్ణయించారు.

మురుగదాస్ మాట్లాడుతూ "ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. ప్రియురాలిని కోల్పోయిన హీరో ప్రియుడిని కోల్పోయిన హీరోయిన్ అనుకోని పరిస్థితుల్లో వీరి పెళ్ళి జరుగుతుంది. వారి పాత ప్రేమను మరచి పోలేని వారిద్దరి దాంపత్యం ఎలా జరుగుతుంది. అనే అంశాన్ని చిత్ర దర్శకుఉడు అట్లీ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తితో తెరకెక్కించాడు. అన్యోన్యత కోల్పొయిన భార్య భర్తల మధ్య సాగే సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది. రొటీన్ గావస్తున్న చిత్రాలకు చాలా భిన్నంగా ఈ రాజా రాణి చిత్రం ఉంటుంది. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని కూడా తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...అన్యోన్యత కరువైన భార్యాభర్తల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే అంశానికి మేళవించిన సెంటిమెంట్ అందరి హృదయాల్నీ స్పృశిస్తుంది. తమిళ ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుందో, అంతకు మించి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం సినిమాకి ఎస్సెట్. త్వరలోనే చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

హాలివుడ్ చిత్రాల సంస్థ ట్వంటీ యత్ సెంచరీ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణంలో గజని,ఠాగూర్ వంటి సంచలన విజయాల దర్శకుడు మురుగదాస్ సమర్పణలో గతంలో జర్నీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన కాంబినేషన్ లో వస్తున్న మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం "రాజా రాణి'' తమిళనాడులో విజయవంతమై దాదాపు నలభై కోట్లకు పైగా విడుదల చేసింది. జై, నజ్రియా నజీమ్, సత్యరాజ్, సంతానం, మనోబాల, సత్యన్, ధన్య బాలకృష్ణన్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జార్జి సి. విలియమ్స్, కూర్పు: ఆంథోనీ ఎల్. రూబెన్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్.

English summary
Arya and Nayanathara starrer Raja Rani will release in March 2013. The makers of the film have planned to release the teaser of this romantic comedy on 14th February, the Valentine ’s Day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu