సినీనటుడు రాజా రవీంద్రపై కేసు నమోదు

వివరాల్లోకి వెళితే... రాజా రవీంద్ర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శనివారం రాత్రి 11.30 గంటలకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి సిబ్బందితో కలసి రోడ్‌నంబర్-12లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు స్కోడా కారులో (ఏపీ 20ఏపీ 1111) ప్రయాణిస్తున్న రాజా రవీంద్రను కూడా ఆపి పరీక్షించగా, ఆయన మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకుని, ఆయనపై కేసు నమోదు చేసుకున్నారు.
రాజా రవీంద్ర ప్రస్తుతం సునీల్, జగపతిబాబు, రామ్ వంటి హీరోల డేట్స్ చూస్తున్నారు. నిర్మాత వ్యవహారాలు, ప్రాజెక్టులు సెట్ చేయటంలో రాజా రవీంద్ర ప్రధాన పాత్ర వహిస్తూంటారు. రాజా రవింద్ర గతంలో రవితేజ డేట్స్ చేసారు..పొరపొచ్చాలు వచ్చి విడిపోయారు.


Click it and Unblock the Notifications











