చిరంజీవి.. డబ్బు సంపాదించడమే కాదు.. గుండె ధైర్యం ఉండాలి.. రాజశేఖర్ ఎమోషనల్

Recommended Video

JAI JAI RAA NARSIMHA REDDY Event || Sye Raa Narasimha Reddy

ప్రముఖ సినీ నిర్మాత,వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించిన సుబ్బిరామిరెడ్డి.. 'సైరా' బృందాన్ని సన్మానించి అభినందించారు.

చిరంజీవి గురించి మాట్లాడే అదృష్టం

చిరంజీవి గురించి మాట్లాడే అదృష్టం

రాజశేఖర్ మాట్లాడుతూ..‘‘చిరంజీవిగారి గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. ఇంత పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం ఉండాలి. హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్. చిరంజీవిగారు లేకుండా రామ్ చరణ్ లేరు. గొప్ప సినిమా తీసి తన తండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. తెలుగువాళ్లందరూ గర్వంగా ఫీలయ్యే సినిమాలో యాక్ట్ చేసిన చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ అని రాజశేఖర్ ప్రశంసలతో ముంచెత్తారు.

చిరంజీవి హాట్సాఫ్

చిరంజీవి హాట్సాఫ్

సైరా లాంటి పెద్ద సినిమాను సురేందర్‌రెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన చాలా లక్కీ. చిరంజీవి గారూ.. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు ఖర్చుపెట్టడం, ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా హ్యాట్సాఫ్ టు యు. అండ్ గ్రేట్. అందరూ ఈ వయసులో అని అంటున్నారు. సినిమా చూసినప్పుడు నాకు ఆయన వయసు కనిపించలేదు. ఆ స్పీడ్ అంతా ఎప్పటిలాగే అనిపించింది అని రాజశేఖర్ అన్నారు.

 తెలుగువారందరూ గర్వపడేలా

తెలుగువారందరూ గర్వపడేలా

తెలుగువారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవిగారు నిజంగా గ్రేట్. ఇలాంటి కార్యక్రమం సుబ్బిరామిరెడ్డిగారు మాత్రమే ఏర్పాటు చేయగలరు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు అని రాజశేఖర్ తెలిపారు. గతంలోని వివాదాలు మరిచిపోయి రాజశేఖర్ ఇలా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకొన్నది.

మరో మైలురాయి

మరో మైలురాయి

దిల్‌రాజు మాట్లాడుతూ...‘‘ఇంతకు ముందు సక్సెస్ మీట్‌లో చెప్పినట్లు చిరంజీవిగారికి ఇది కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్. 151 సినిమాల్లో ఎన్నో అద్భుతాలు చూశారు. ఎన్నో విజయాలు చూశారు. కానీ, ఇదొక మైల్‌స్టోన్ సినిమా అని అన్నారు.

మెగాస్టార్‌కు ప్రత్యేకమైన కేక్

మెగాస్టార్‌కు ప్రత్యేకమైన కేక్

సైరా కార్యక్రమంలో సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్ దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, కేథరిన్, నిహారిక, అశ్వినీదత్, బోనీకపూర్, సురేష్ బాబు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్,సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్‌రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సన్‌షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి చిరంజీవి మీద అభిమానంతో ‘సైరా' ప్రత్యేక కేక్‌ను తయారు చేయించి మెగాస్టార్‌కు బహూకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X