యువ హీరో చిత్రంలో విలన్‌గా రాజశేఖర్!

By Rajababu

వరుస ఫ్లాప్‌లతో టాలీవుడ్ నుంచి దాదాపు కనుమరుగైన రాజశేఖర్ గరుడవేగ'తో మళ్లీ తన స్థానాన్ని పదిలపరుచుకొన్నాడు. అయితే తాజాగా ఓ చిత్రంలో విలన్‌గా కనిపించేందుకు సిద్దపడినట్టు తెలుస్తున్నది. యువ హీరో రాంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించే చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపిస్తారట. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాలో విలన్ కోసం రాజశేఖర్‌ను సంప్రదించారని, ఆయన కూడా కొంత సానుకూలంగా స్పందించారనే వార్త ప్రచారమవుతున్నది.

ఇదిలా ఉండగా, గరుడవేగ సినిమాతో సక్సెస్ లభించినప్పటికీ తన పాత్రలను ఆచీతూచి ఎంపిక చేసుకొంటున్నాడు. ప్రస్తుతం అ! చిత్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సినీవర్గాలు చెప్పుకొంటున్నాయి. ఈ చిత్రానికి కల్కి అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

Raja Shekar to act as Villain in Praveen Sattaru movie

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X