‘రాజా ది గ్రేట్’ పబ్లిక్ టాక్ అండ్ ట్విట్టర్ రివ్యూస్...

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై రవితేజ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్‌'. అనిల్‌రావిపూడి దర్శకుడు. శిరీష్‌ నిర్మాత. మెహరీన్‌ హీరోయిన్‌.

By Bojja Kumar

Recommended Video

Raja the Great Movie Public Talk - Filmibeat Telugu

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై రవితేజ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్‌'. అనిల్‌రావిపూడి దర్శకుడు. శిరీష్‌ నిర్మాత. మెహరీన్‌ హీరోయిన్‌. ఈ సినిమా బుధవారం గ్రాండ్ గా రిలీజైంది.

రవితేజ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లయింది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. యూఎస్ఏతో పాటు విదేశాల్లో 'రాజా ది గ్రేట్' ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయి టాక్ బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు పడటంతో కొందరు ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు.

సినిమా మీద టాక్ ఎలా ఉంది?

సినిమా మీద టాక్ ఎలా ఉంది?

దాదాపు రెండేళ్ల తర్వాత బాక్సాఫీసు బరిలో దూకిన రవితేజ సినిమాకు ఆడియన్స్ నుండి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రవితేజ మార్క్ ఏమాత్రం తగ్గంకుడా సినిమా ఉందని, ఫుల్ లెంగ్త్ అంధుడి పాత్రలో రవితేజ బాగా చేశాడని, ఇలాంటి రిస్కీ క్యారెక్టర్ ఎంచుకున్నందుకు రవితేజను అప్రిషియేట్ చేయాల్సిందే అంటున్నారు.

 సినిమాలో ప్లస్ పాయింట్స్

సినిమాలో ప్లస్ పాయింట్స్

రవితేజ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్సయిందని, కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలో గున్న గున్న మామాడి ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేస్తుందట.

సినిమాలో మైనస్ పాయింట్స్

సినిమాలో మైనస్ పాయింట్స్

స్టోరీ అంత కొత్తగా ఏమీ లేదని, పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు. ఫైట్స్ విషయంలో కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రవితేజ పెర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడొచ్చనే టాక్ వినిపిస్తోంది.

హిట్ మూవీ అంటూ ట్వీట్

రాజా ది గ్రేట్ సినిమా బావుంది. ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ సూపర్. ఎక్సలెంట్ కమర్షియల్ మూవీ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ బాలేదు

అయితే కొందరు మాత్రం సినిమా ఫస్టాఫ్ బావుందని, సెకండాఫ్ బాగోలేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 రొటీన్ మసాలా మూవీ

రొటీన్ మసాలా మూవీ

రాజా ది గ్రేట్ ఫస్టాఫ్ ఫర్వాలేదు, సెకండాప్ యావరేజ్ గా ఉంది. ఓవరాల్ గా యావరేజ్ మూవీ. రోటీన్ మసాలా మూవీ. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ కొత్తగా లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి డైరెక్షన్ నచ్చింది

సినిమా ఫస్టాఫ్ చాలా బావుంది, అనిల్ రావిపూడి దర్శకత్వం ఇరగదీశాడు అంటూ కొందరు ట్వీట్స్ చేశారు.

పైసా వసూల్ యాక్షన్ కామెడీ

రవితేజ అదరగొట్టాడు. పైసా వసూల్ యాక్షన్ కామెడీ. పర్ఫెక్ట్ దిపావళి మూవీ అంటూకొందరు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

సెకండాఫ్ లో ఫైట్స్ కేక

సెకండాఫ్ లో యాక్షన్ సీన్లు కన్నుల విందుగా ఉన్నాయి. సినిమా చాలా బావుంది.... అంటూ కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X