రాజా ది గ్రేట్ ఫస్ట్ టాక్.. అంధుడిగా రవితేజ.. తల్లి సెంటిమెంట్ హైలెట్
కిక్2, బెంగాల్ టైగర్ చిత్రాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రవితేజ నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ చిత్రంలో వినూత్నమైన పాత్రను ఎంచుకొని ఓ ప్రయోగానికి ఒడిగట్టాడు. తన కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించినప్పటి
Recommended Video

కిక్2, బెంగాల్ టైగర్ చిత్రాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రవితేజ నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ చిత్రంలో వినూత్నమైన పాత్రను ఎంచుకొని ఓ ప్రయోగానికి ఒడిగట్టాడు. తన కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించినప్పటికీ.. ఇంత వరకు అంధుడి పాత్రను పోషించలేదు. ఈ నేపథ్యంలో రవితేజ తొలిసారి రాజా ది గ్రేట్‌లో ఓ సవాల్ తీసుకొని అంధుడి పాత్రను పోషించాడు. అంధుడి పాత్రలో రవితేజ ఎలా మెప్పించాడు అనే తెరపైన చూడాల్సిందే..

రాజా ది గ్రేట్ కథ ఇదే..
రవితేజ పుట్టుకతోనే గుడ్డివాడు. తల్లి (రాధిక)కు తన కుమారుడిని పోలీస్‌గా చూడాలని కలలు కంటుంది. అయితే గుడ్డివాడు కావడంతో పోలీసు ఉద్యోగానికి అనర్హుడిగా మారుతాడు. ఈ క్రమంలో హీరోయిన్ (మెహ్రీన్)కు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను రవితేజ భుజాన వేసుకొంటాడు. అయితే దానికి ఓ పోలీస్ ఆపరేషన్ అవసరం అవుతుంది. ఆ ఆపరేషన్‌లో ఎలా రవితేజ వెళ్లాడు. పోలీసులకు సాధ్యం కాని పనిని ఎలా పూర్తి చేశాడు అనేది రాజా ది గ్రేట్ కథ.

తల్లిగా రాధిక అదుర్స్ అట..
గుడ్డివాడైన తన కుమారుడు రవితేజను ఎప్పుడూ రాజా ది గ్రేట్ అని పిలుస్తుందట. తల్లి సెంటిమెంట్‌కు పెద్ద పీట వేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తెలుగులో రాధికకు ఈ చిత్రం కమ్ బ్యాక్ సినిమా అవుతుందట.

రవితేజ కష్టపడ్డాడు..
అంధుడి పాత్ర కోసం రవితేజ చాలా కష్టపడ్డాడు. ఆ పాత్ర కోసం చాలా పరిశోధన చేశాం. రవితేజ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా మిగులుతుంది రాజా ది గ్రేట్ అని అనిల్ రావిపూడి చెప్పారు.

ముందు తారక్‌కు రాజా ది గ్రేట్
రాజా ది గ్రేట్ కథను ముందుగా తారక్‌కు చెప్పాను. అయితే అది తారక్ నచ్చకపోవడంతో మరింత కసరత్తు చేసి కథను కొత్తగా రాసుకొన్నాను. ఆ కథను రవితేజకు చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అనిల్ చెప్పారు.

దివ్యాంగులు అంటే
దివ్యాంగులు అంటే నాకు మనసులో ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎలాంటి ప్లాన్ లేకుండానే నా చిత్రంలో వారి ప్రతిభను ఎక్కడో ఓ చోట పెడుతాను. వారు మనకంటే మానసికంగా బలవంతులు అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు.

రవితేజ కుమారుడు మహాధన్
రవితేజ చిన్నప్పటి పాత్ర కోసం రవితేజ కుమారుడు మహాధన్ నటింపజేయాలనుకొన్నాం. రవితేజను సంప్రదించగా ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆయనను ఒప్పించాం

అద్భుతంగా మహాధన్ యాక్టింగ్
రవితేజ కుమారుడు మహాధన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన యాక్టింగ్ చూస్తే నిజంగా గుడ్డివాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. మహాధన్ పాత్ర ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది అని అనిల్ రావిపూడి చెప్పారు.


Click it and Unblock the Notifications











