రాజా వారు రాణి గారు టీజర్‌కు క్రేజీగా రెస్పాన్స్.. మీడియాలో టాప్ ట్రెండింగ్

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వినూత్న రీతిలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ #RVRG. #RVRG అంటే రాజావారు రాణిగారు అనే టైటిల్‌తో విడుదల కాబోతున్న మూవీ. ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ "రాజావారు రాణిగారు" అంటూ టైటిల్ పోస్టర్‌ను, ఓ మోషన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ టైటిల్, మోషన్ వీడియో‌లో ఉన్న నేపథ్య సంగీతం ఇప్పటికే జనాన్ని తెగ ఆకట్టుకుంది.

Raja Vaaru Rani Gaaru teaser goes viral

రాజుగారు రాణివారు టీజర్ చూస్తే ప్రతీ వ్యక్తికి ప్రతీ ఒక్కరి జీవితంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండదనే మాట వినిపించింది. ఈ చిత్రం ద్వారా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. యువ నిర్మాత మనోవికాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించారు. జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో ఇటీవల జరిగింది.

Raja Vaaru Rani Gaaru teaser goes viral

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మనోవికాస్ మాట్లాడుతూ.... రాజా వారు రాణి గారు చిత్రం అందరికీ మంచి అనుభూతి ఇస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. డైరెక్టర్ రవి కిరణ్ చాలా కష్టపడ్డాడు. కిరణ్ అన్నతో డిస్కస్ చేస్తున్నప్పుడు రాజావారు కథ విని ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాం. హీరోయిన్ రహస్య సిస్టర్‌లా సెట్స్‌ని చిల్ చేసింది. ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయింది. మా టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. టీజర్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అని అన్నారు.

హీరోయిన్ రహస్య మాట్లాడుతూ... ఆండ్రాయిడ్, ఐవోఎస్ కాలం నుంచి 1100 నాటి రోజుల్ని గుర్తుకు తెచ్చే సినిమా ఇది. రాజా వారు రాణి గారు మీ అందరినీ నోస్టాల్జిక్ రైడ్ ని ఫీల్ అయ్యేలా చేస్తుంది. టీజర్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. అని అన్నారు.

డైరెక్టర్ రవి కిరణ్ మాట్లాడుతూ.... టీజర్ లో చెప్పినట్టు... కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తో తీర్చిదిద్దాం. చూసిన ప్రతీ ఒక్కరికీ ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అని అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ... చాలా హ్యాపిగా ఉన్నాం. ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. రాజా వారు రాణి గారు త్వరలో రిలీజ్ అవుతుంది. మీ నోస్టాల్జిక్ మూవ్ మెంట్స్ గుర్తు చేసుకొని నవ్వుకుంటారు. టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అందరికీ షేర్ చేయండి. సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థాంక్స్. అని అన్నారు.

తాజాగా ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ టీజర్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. కామెంట్లతో టీజర్ గురించి అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రముఖులు, టాప్ డిస్టిబ్యూటర్లు కన్నేశారు. సినిమా హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X