రాజమౌళి ఇప్పుడు ఫీలవుతున్నాడు

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఛత్రపతి' సినిమా ఇటీవల ఓ ఛానల్‌లో ప్రసారమైంది. దీన్ని చూసిన ఆయన ఆ సినిమాలో మరిన్ని మార్పులు చేస్తే మరింత ఎఫెక్టివ్ గా ఉండేదని ఫీలవుతున్నారు. ఈ విషయం ఆయన ఫేస్ బుక్ లో రాసారు. ఆయన స్పందిస్తూ... ''సినిమాలో షఫి పాత్రను మరింత ప్రభావవంతంగా రూపొందించి ఉండాల్సింది. నేను అనుకున్నట్లుగా ఆ పాత్ర రాలేదు'' అన్నారాయన.

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చెక్కుతున్న శిల్పం... బాహుబలి కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై ట్రేడ్ లో ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రభాస్,అనుష్క పుట్టిన రోజులను పరస్కరించుకుని విడుదల చేసిన మేకింగ్ వీడియోలు ఇప్పటికే అందరిలో అమితమైన ఆసక్తిని రేపటంలో సఫలీకృతమయ్యాయి. దాంతో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంత వరకూ వెళతాయి అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.

Rajamoli tweeted about Chatrapathi

మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది? ఎప్పుడొస్తుంది? అసలు ఇప్పుడేం జరుగుతోంది? ఇంతకీ ఎలా ఉంటుంది ఆ సినిమా? ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడు? ఎంత డబ్బుతో తీస్తున్నారు? ఇలా ఒకటేమిటి? ఒకరేమిటి? ఇతర చిత్ర పరిశ్రమలు కూడా మన 'బాహుబలి' గురించి ఆరాతీస్తున్నాయి. ఈ సినిమా గురించి ఎంత గోప్యంగా ఉంచుతూంటే అంత ఆసక్తి రేపుతోంది.

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్‌.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X