»   » బాహుబలి కలెక్షన్ల గురించి రాజమౌళి ఇలా అన్నారేంటి?

బాహుబలి కలెక్షన్ల గురించి రాజమౌళి ఇలా అన్నారేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరరెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' ఈనెల 10న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ నేపథ్యంలో అంతా ఈ చిత్రం ఓపెనింగ్స్ ఏ రేంజిలో ఉంటాయో, సినిమా మొత్తం ఎంత కలెక్షన్ సాధిస్తుందో? ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అంటూ చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.... సినిమా కలెక్షన్ల పరంగా ఎంత సంపాదించింది అనే దానికంటే, సినిమా క్రియేటివిటీ కోణంలో హిట్టయితే అదే తనకు ఆనందమని పేర్కొన్నారు. తాము పడ్డ కష్టానికి గుర్తింపు లభించినప్పుడే ఘన విజయం సాధించినట్లు భావిస్తానని రాజమౌళి చెప్పుకొచ్చారు. బాక్సాఫీసు అంకెల కంటే సృజనాత్మక సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తానన్నారు.


ట్రేడ్ టాక్..
సినిమా ఇప్పటికే అంచనాలకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు అన్ని థియేటర్లలో అడ్వాన్డ్స్ బుకింగ్ ఇస్తున్నారు. టికెట్స్ అన్ని ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయి పోయాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు కనీసం 15 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Rajamouli about Baahubali collections

ఇతర ఏరియాల్లో 5 కోట్ల వరకు షేర్ వస్తుందని అంచనా. ఇక యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 800k నుండి 1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని అంచనా. మరో వైపు ఈ చిత్రానికి కర్ణాటకలో ఈచిత్రానికి సంబందించిన టికెట్స్ రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో అక్కడ వసూళ్లు భారీగానే ఉండొచ్చని అంటున్నారు.


సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే... తొలి వారం 65 కోట్ల వసూలు చేయొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం గత రికార్డులను, అంచనాలను బద్దలు కొడుతూ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాహుబలి తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే స్తాయిలో ఫలితాలు సాధించాలని ఆశిద్దాం.

English summary
Rajamouli about Baahubali collections.
Please Wait while comments are loading...