twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముఖ్యమంత్రిని చూసి భయంతో.. 6 నెలలు తప్పించుకున్నా.. రాజమౌళి!

    |

    దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాకే గర్వకారణమైన దర్శకుడు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. బాహుబలి చిత్రంతో భారత సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. ఒక తెలుగు సినిమాగా విడుదలైన బాహుబలి చిత్రం గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంది. దర్శకుడిగా రాజమౌళి క్రియేటివిటీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, దిగ్గజ దర్శకుడు శంకర్ లాంటి ప్రముఖులు కూడా రాజమౌళి అద్భుతమైన దర్శకుడు అంటూ కొనియాడారు. రాజమౌళి క్రియేటివిటీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాడుకోవాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

    అమరావతి రాజధాని

    అమరావతి రాజధాని

    గత నాలుగేళ్లుగా అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఉన్నత స్థాయిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ తదితర భవంతుల నిర్మాణం ఉండాలని చంద్రబాబు దేశ విదేశాల ఆర్కిటెక్ట్‌లని సంప్రదించారు. అదే సమయంలో రాజమౌళి క్రియేటివిటీని కూడా ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావించారు.

    చంద్రబాబుతో భేటీ

    చంద్రబాబుతో భేటీ

    గత ఏడాది రాజమౌళి.. ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి రాజధాని నిర్మాణం విషయంలో పలు సూచనలు సలహాలు చేశారు. రాజమౌళి చేసిన కొన్ని ప్రతిపాదనలకు కూడా ఆమోద ముద్ర లభించింది. ఓ కార్యక్రమంలో రాజమౌళి ఈ విషయం గురించి మాట్లాడుతూ చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని డిజైన్స్ కోసం తాను చేసిన ప్రతిపాదనల్ని వివరించారు.

    నాని సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ ఎఫెక్ట్!నాని సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ ఎఫెక్ట్!

    6 నెలలు తప్పించుకున్నా

    6 నెలలు తప్పించుకున్నా

    రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం తనని సంప్రదించినప్పుడు 6 నెలల పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించా. ఆర్కిటెక్ట్ గురించి నాకేం తెలుసు.. అసెంబ్లీ నిర్మాణం గురించి నాకు ఎలాంటి ఐడియా ఉంటుంది అని భయపడ్డా. కానీ చంద్రబాబు గారు ఏదైనా అనుకుంటే వదిలే రకం కాదు. మొత్తానికి నన్ను కూడా రాజధాని నిర్మాణంలో భాగం చేశారని రాజమౌళి తెలిపారు.

    నేను ఏం చేయగలను అని ఆలోచించా

    నేను ఏం చేయగలను అని ఆలోచించా

    చంద్రబాబు నన్ను పిలిపించిన తరువాత అమరావతి డిజైన్స్‌ని పరిశీలించి నేను వీళ్లకు ఏవిధంగా ఉపయోగపడగలను అని ఆలోచించా. అమరావతి ప్లానింగ్ కమిటీలో క్రియేటివ్ పర్సన్స్ లేరు. కాబట్టి క్రియేటివ్ పర్సన్‌గా నాకు తోచిన విషయాన్ని చెప్పాలని అనుకున్నా. ముఖ్యమంత్రిగారికి, లండన్ లో ఉన్న ఆర్కిటెక్ లకు నేను ఒక వారధిలా పనిచేశా.

     ఆ ఆలోచన నాదే

    ఆ ఆలోచన నాదే

    ఒక బిల్డింగ్ డిజైన్ విషయంలో అంతర్లీనంగా కథ చెప్పాలని అనుకున్నారు. అందుకు ఎలాంటి చిత్రాలు అవసరం అని అడిగినప్పుడు నేను కొన్ని సూచించా. కానీ ఆ డిజైన్ ఒకే కాలేదు. అప్పటికే రెడీగా ఉన్నా మరో డిజైన్ ఒకే అయింది. ఆ బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని సూచించా. ఈ ప్రతిపాదనని అందరూ ఆమోదించారని రాజమౌళి తెలిపారు.

    English summary
    SS Rajamouli about Chandrababu Rejecting his Designs of Amaravathi. Rajamouli Propose some key ideas to Amaravathi Planning
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X