»   » సహాయం..రామానాయుడు స్టూడియోకు పంపండి: రాజమౌళి

సహాయం..రామానాయుడు స్టూడియోకు పంపండి: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చెన్నై వరద బాదితుల కోసం రాజమౌళి అండ్ టీం తమ వంతు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో డబ్బు విరాళంగా ఇవ్వడం కంటే ఆహారం, మెడిసిన్, వాటర్ అందించడం ముఖ్యమని భావించిన రాజమౌళి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిపై రాజమౌళి స్పందిస్తూ...‘వందేళ్ల కాలంలో ఎన్నడూ చూడని భారీ వరదలను చెన్నై ఎదుర్కొంటోంది. వీటి కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలవ్వడం బాధాకరం. మా టీం వారికి కావాల్సిన సరుకులను పంపుతోంది. ప్రతి ఒక్కరూ తమకు చేతనైనవి పంపాలి' అని కోరారు.

Rajamouli about Chennai aid

అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం..... ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు విరాళంగా ఇవ్వడం కంటే... వారికి కావాల్సిన ఫుడ్, మెడికల్ సప్లిస్, డ్రింకింగ్ వాటర్ అందించడం ఎంతో అవసరం. నిల్వ ఉండే ఫుడ్, మెడికల్ సప్లిస్, డ్రింకింగ్ వాటర్ లాంటివి అందించే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఇతర వస్తువులు ఏమైనా పంపాలనుకుంటే రామానాయుడు స్టూడియో, ఫిల్మ్ నగర్, జూబ్లిహిల్స్, హైదరాబాద్ అడ్రస్ కు పంపండి. తప్పకుండా వీటిని నేరుగా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండే బాధితులకు మేము అందజేస్తాం' అని రాజమౌళి ఫేస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

దయచేసి ఎవరూ వాడిన దుస్తువులు మాత్రం పంపొద్దు. గతానుభవంతో చెబుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని తీసుకోవడానికి ఇష్టపడరు. మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అక్కడి వారికి బాగా ఉపయోగ పడుతుందని బావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న రానాకు థాంక్స్ అని రాజమౌళి పేర్కొన్నారు.

English summary
"Chennai is experiencing the biggest floods in over a century... Deeply saddened hearing of the lakhs of people that are suffering. Our team is sending supplies to all those in need and I ask you all to do the same. It is important to understand that the need of the hour is not just money, but also other more necessary provisions. Please drop off any non-perishable foods, medical supplies, drinking water and any other items you think can offer aid, at Ramanaidu Studios, Film Nagar, Jubilee Hills, Hyderabad." Rajamouli saud.
Please Wait while comments are loading...