twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మగధీర’ విషయంలో అల్లు అరవింద్ అలా చేయడం నచ్చలేదు: రాజమౌళి

    అల్లు అరవింద్ గారు చేసిన దానికి కోపంతో ‘100 డేస్‌ ఫంక్షన్‌కు రాలేను’ అని చెప్పాను అని రాజమౌళి తెలిపారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి కంటే ముందు రాజమౌళి తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం 'మగధీర'. 2009లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా అది. అప్పట్లో ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కనీ విని ఎరుగని విజయం సాధించింది.

    ఓ వైపు మగధీర విజయాన్ని మెగా ఫ్యామిలీ, అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో..... కొన్ని రూమర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా విజయానికి ప్రధాన కారమైన రాజమౌళిని మెగా ఫ్యామిలీ పక్కన పెట్టేసిందని, సినిమా విజయంలో ఆయన ప్రాధాన్యతను కావాలనే పంచుకోవడం లేదనే వార్తలు వచ్చాయి.

    రాజమౌళి మనస్థాపానికి గురయ్యాడంటూ...

    రాజమౌళి మనస్థాపానికి గురయ్యాడంటూ...

    మగధీర విజయానికి కారణం రాజమౌళి కాదు.... రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ ఇమేజే కారణం అనేలా సీన్ క్రేయేట్ చేయడంతో....... మనస్థాపానికి గురైన రాజమౌళి కావాలనే ‘ఈగ'ను పెట్టి సినిమా తీసి తన సత్తా చాటుకున్నారని అప్పట్లో టాక్.

    ఈ వివాదంపై రాజమౌళి స్పందన

    ఈ వివాదంపై రాజమౌళి స్పందన

    అప్పట్లో మగధీరపై వచ్చిన ఈ వార్తలపై దర్శకుడు రాజమౌళి తాజాగా ‘ఆర్కే' ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. మగధీర యాభై రోజులు ఆడిన తరువాత నేను, చరణ్‌ గుర్రంపై రైడ్‌ చేస్తున్న పోస్టర్‌ డిజైన్‌ చేయించారు. అరవింద్‌గారు ఆ పోస్టర్‌ చూపించారు. కనిపించడం ఇష్టమే కానీ, మరీ అంత వద్దు అని చెప్పాను. అయినా వినకుండా వేయించారు. సక్సెస్‌లో నాకు క్రెడిట్‌ ఇవ్వకపోవడం అంటూ ఏమీలేదు. అది వాస్తవం కాదు అని రాజమౌళి తెలిపారు.

    అప్పట్లో అంతా ఫేక్ నడిచేది

    అప్పట్లో అంతా ఫేక్ నడిచేది

    మగధీర సినిమా విడుదలైన సమయంలో అంతకు ముందు.... సినిమాలు వంద రోజులు ఆడినా ఆడకపోయినా.. థియేటర్ల సంఖ్య పెంచేసి.. ప్రకటించేవారు. అన్ని సినిమాలకూ జరిగే ప్రక్రియే ఇది. నాకేమో అలా నచ్చేది కాదు. ‘సింహాద్రి' సినిమా సరిగ్గా గుర్తులేదు కానీ చాలా థియేటర్లలో వంద రోజులు ఆడింది. అది జెన్యూన్‌. చాలా ఆనందపడ్డాం. అక్కడితో ఆగకుండా 175 డేస్‌ కూడా ఆడించాలని చెప్పి 15 థియేటర్లలో ఆడితే, మరో 15 థియేటర్లలో ఆడించారు. నాకది చాలా ఇబ్బందిగా ఉండేది. ‘సింహాద్రి' సినిమాకే కాదు, అన్ని సినిమాలకూ, అందరి హీరోలకూ ఇలానే ఉండేది. నేను అరవింద్‌గారితో సినిమా మొదలుపెట్టినపుడు ఈ విషయాన్నే చర్చించాం. ‘అలాంటి ప్రకటనలకు మనం దూరంగా ఉందాం సార్‌' అన్నాను. ఆయన ‘ఓకే డన్‌' అన్నారు అని రాజమౌళి ఆర్కే ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    అల్లు అరవింద్ గారు అలా చేయడం నచ్చలేదు

    అల్లు అరవింద్ గారు అలా చేయడం నచ్చలేదు

    మేము ముందుగా అనుకున్నది ఒకటి.... అల్లు అరవింద్ గారు చేసింది మరొకటి. 100 డేస్‌ థియేటర్స్‌ పెంచడం మొదలుపెట్టారు. అప్పుడు నేను అరవింద్‌గారి దగ్గరికి వెళ్లి.. ‘‘మనం అలాంటి ప్రకటనలు వద్దనుకున్నాం కదా'' అనడిగాను. అప్పుడాయన ‘నాకూ ఆపేయాలనే ఉంది రాజమౌళీ.. కానీ, ఫ్యాన్స్‌తో చాలా ఇబ్బందిగా ఉంది. మాకుండే డెలికేట్‌ ఇష్యూస్‌ నీకు తెలియదు' అన్నారు, ఆయన అలా చేయడం నాకు నచ్చలేదు అని రాజమౌళి తెలిపారు.

    మగధీర 100 డేస్‌ ఫంక్షన్‌కు రాలేను’ అని చెప్పాను

    మగధీర 100 డేస్‌ ఫంక్షన్‌కు రాలేను’ అని చెప్పాను

    అల్లు అరవింద్ గారు చేసిన దానికి కోపంతో ‘100 డేస్‌ ఫంక్షన్‌కు రాలేను' అని చెప్పాను. ‘నువ్వు రాకపోతే సిట్యుయేషన్‌ ఎలా ఉంటుందో తెలుసా' అన్నారు. నాకర్థమయింది కానీ రాలేను అని చెప్పాను. పరిస్థితులను ఇద్దరం అర్థం చేస్తున్నాం. అంతేతప్ప గొడవలేం రాలేదు. వేరే ప్రొడ్యూసర్‌తోనైతే అంతవరకు కూడా రాదు. అరవింద్‌గారు అంత చనువు ఇచ్చారే కాబట్టే మాట్లాడాను అని రాజమౌళి తాజాగా ఆర్కే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    English summary
    Rajamouli has revealed that he had several issues with Magadheera producer Allu Aravind and that was why he did not attend the film's100 days function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X