ఆ పదిరోజులూ నరకం అనుభవించా:రాజమౌళి
'మకుట' గ్రాఫిక్స్ స్టూడియో వాళ్లు 'ఈగ' డిజైన్ చేసి చూపిస్తే అస్సలు నచ్చలేదు. ఏదో కంప్యూటర్ గ్రాఫిక్స్‌లా ఉంది తప్ప, 'ఈగ' పోలికలే లేవు. నా గుండె జారిపోయింది. అప్పటికే పదికోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం. ఏదో యాభై లక్షలో, కోటి రూపాయలో అయ్యుంటే సినిమాను అక్కడికక్కడ ఆపేసేవాళ్లం.ఆ పదిరోజులూ నరకం అనుభవించాను అన్నారు రాజమౌళి.
అయితే అప్పటికే సగం దూరం వచ్చేశాం. ముందుకు వెళ్లాల్సిందే. 'ఈగ' లాంటి గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ మూవీకి ప్రీ ప్రొడక్షన్ చాలా ముఖ్యమనే విషయం, షూటింగ్ సగం పూర్తయ్యాక గానీ అర్థం కాలేదు.తర్వాత గ్రాఫిక్స్ వాళ్లతో 'ఎంత ఆలస్యమైనా పర్లేదు... ప్రాజెక్ట్ కరెక్ట్‌గా రావాలి' అని చెప్పాను. అప్పుడు కరెక్ట్ ప్రాసెస్‌లో వెళ్లాను. 'ఈగ' మోడలింగ్‌కే మూడు నెలలు పట్టింది. చివరకు నేననుకున్నట్టుగా 'ఈగ' తయారైంది అన్నారు రాజమౌళి.
నా ప్రతి సినిమాకీ ఇలాంటి ఫీలింగే ఉంటుంది. కానీ మొండిధైర్యంతో ముందుకెళ్లిపోతుంటాను. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌కే దాదాపు రెండేళ్లు పట్టింది. అసలు ఈగతో సినిమా తీయాలనే ఆలోచన రావటానికి కారణం చెపుతూ...ఇది పదిహేనేళ్ల క్రితం నాటి ఆలోచన. మా నాన్నగారు సరదాగా ఈగ ప్రధాన పాత్రలో ఓ కథ చెబితే చాలా ఎంజాయ్ చేశాను. ఈ కథతో భవిష్యత్తులో నేనే సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. 'ఛత్రపతి' చేస్తున్నప్పుడు... తర్వాత ఏదైనా చిన్న సినిమా చేద్దామా అనిపించింది. లవ్‌స్టోరీనో, కామెడీ స్టోరీనో అయితే నా వల్ల కాదు. ఏదైనా అబ్బురంగా అనిపించే కథాంశం కావాలనిపించింది. అలా 'ఈగ' ముందుకొచ్చింది.
నాని, సమంత, సుదీప్ కీలక పాత్రలను పోషించిన ఈ సినిమా వారాహి చలనచిత్రం పతాకంపై రూపొందింది. ఓ కొత్త పాయింట్‌తో, ఆసక్తికరమైన కథనంతో తయారవుతున్న 'ఈగ' సినిమా మీదే ఇప్పుడందరి దృష్టి ఉంది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న 'ఈగ' చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్.రవీందర్, స్టైలింగ్: రమా రాజమౌళి, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత: సాయి కొర్రపాటి, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్ .ఎస్. రాజమౌళి.


Click it and Unblock the Notifications











